ఉదయాస్తమాన సేవను ప్రారంభించిన కాణిపాకం దివ్య క్షేత్రం.. టికెట్ ధర..?

స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారు వెలసిన దివ్య క్షేత్రం కాణిపాకం.

స్వామి వారు స్వయం వ్యక్తమై ఒక బావిలో వెలిసిన దివ్య క్షేత్రమే కాణిపాకం.

ఇక్కడ వెలిసిన స్వామి వారు భక్తుల కోరికలను తీర్చే కొంగుబంగారమై బాసిల్లుతున్నారు.దేవాలయ చరిత్ర ప్రకారం చిత్తూరు జిల్లాలోని బహుదా నది తీరంలో వెలసిన లంబోదరుడికి 1000 సంవత్సరాల చరిత్ర ఉంది.

సత్య ప్రమాణాల దేవుడైన కాణిపాకం విఘ్నేశ్వరుడి ముందు ప్రమాణం చేయడానికి అబద్ధాలు చెప్పేవారు కూడా భయంతో వణికి పోయేవారు.

కాణిపాకంలో ప్రమాణం చేస్తారా అంటూ సవాల్ విసురుతారు.ఇక్కడ చేసిన ప్రమాణాలకు బ్రిటిష్ కాలంలో న్యాయస్థానాలలో కూడా ప్రామాణికంగా తీసుకునేవారు.గతంలో స్వామి వారికి నిత్య పూజ కైంకర్యాలు దేవాలయంలో ఆలయ ఉభయదారులు నిర్వహించేవారు.

Advertisement

కాలక్రమేణా స్వామి వారి దేవాలయం నిర్వహణ బాధ్యతలు దేవాదాయశాఖ స్వాధీనం చేసుకుంది.అప్పటి నుంచి స్వామివారి దేవాలయం అంచెంచలుగా అభివృద్ధి చెందుతూ వస్తోంది.

ప్రస్తుతం రోజుకి 20,000 మంది పైగా భక్తులు స్వామివారి దర్శనానికి వచ్చిన సమర్థవంతమైన ఏర్పాట్లు చేసే స్థాయికి వెళ్ళింది.కాణిపాకంలో కూడా తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలోనే అర్జిత సేవలు మొదలుపెట్టారు.మార్చి 4వ తేదీ నుంచి కొత్తగా సహస్రనామార్చన, మహా మంగళహారతి,రెండు ఆర్జిత సేవలను దేవస్థానం అధికారులు మొదలుపెట్టనున్నారు.ఉదయం 6 గంటల నుంచి 6.45 నిమిషంలో వరకు నిర్వహించే సహస్రనామార్చన సేవా టికెట్ ధర 1000 రూపాయలుగా దేవాలయ అధికారులు నిర్ణయించారు.మార్చి 5 వ తేదీ నుంచి ఉదయాస్తమయ సేవా ప్రారంభం అవుతుంది.

వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోరికలు మేరకు ఈ సేవను మొదలు పెడుతున్నట్లు దేవాలయ అధికారులు వెల్లడించారు.ఉదయాస్తమయ సేవ టికెట్ ధర లక్ష రూపాయలుగా నిర్ణయించారు.

ఈ సేవలో దంపతులకు సంవత్సరానికి ఒకసారి మాత్రమే అనుమతిస్తారని వెల్లడించారు.ఈ సేవ యొక్క కాలపరిమితి 10 సంవత్సరాలు ఉంటుందని వెల్లడించారు.

రాజాసాబ్ సినిమా వచ్చేది అప్పుడేనా..?మారుతి ఎందుకంత స్లో గా వర్క్ చేస్తున్నాడు...
ఉల్లి, ఉసిరి క‌లిపి ఇలా తీసుకుంటే..ర‌క్త‌హీన‌త ప‌రార్‌!

ఇంకా చెప్పాలంటే దేవాలయంలో జరిగే 13 సేవలకు భక్తులు అనుమతిస్తున్నట్లు దేవాలయా ఈవో వెంకటేష్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు