ఒమిక్రాన్ భయాలు: యూఏఈ సంచలన నిర్ణయం.. వ్యాక్సిన్ తీసుకోకుంటే విమానం ఎక్కలేరు

దక్షిణాఫ్రికాలో పుట్టిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచాన్ని వణికిస్తున్న సంగతి తెలిసిందే.ఒక్కొక్క దేశంలోకి అడుగుపెడుతూ ప్రభుత్వాలకు నిద్ర లేకుండా చేస్తోంది.

ఇప్పటికే యూఎస్‌, యూకే, దక్షిణాఫ్రికా, ఫ్రాన్స్‌‌లో కోవిడ్ తీవ్రత ఎక్కువగా వుంది.రాబోయే రోజుల్లో మరికొన్ని దేశాల్లో కూడా ఇదే పరిస్ధితి నెలకొంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఈ నేపథ్యంలో విమాన ప్రయాణీకులపై ఆంక్షలు విధిస్తున్నాయి ప్రభుత్వాలు.ఈ క్రమంలోనే అరబ్ దేశం యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కీలక నిర్ణయం తీసుకుంది.

జనవరి 10 నుంచి కరోనా టీకాలు వేయించుకొని తమ పౌరులపై ప్రయాణ నిషేధాన్ని ప్రకటించింది.అలాగే అల్రెడీ టీకాలు వేయించుకున్న పౌరులు .కొత్త ప్రోటోకాల్ ప్రకారం బూస్టర్ డోస్ తీసుకోవాల్సిందేనని యూఏఈ నేషనల్ ఎమర్జెన్సీ క్రైసిస్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ఎన్‌సీఈఎంఏ) స్పష్టం చేసింది.అయితే కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోనప్పటికీ వైద్య పరంగా మినహాయింపు వున్న వ్యక్తులు, వైద్యం, చికిత్స తదితర కారణాల రీత్యా ప్రయాణించే వారిని మాత్రం ప్రయాణానికి అనుమతిస్తామని ఎన్‌సీఈఎంఏ ట్విట్టర్‌లో పేర్కొంది.

Advertisement

అమెరికా, యూరప్‌లో ఒమిక్రాన్ కేసుల పెరుగుదల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.ఈ వారం ప్రారంభంలో ఒమిక్రాన్ కార‌ణంగా ప్ర‌పంచ వ్యాప్తంగా 11,500 విమాన స‌ర్వీసులు ర‌ద్దు అయిన‌ట్టు స‌మాచారం.

ముఖ్యంగా కరోనా ప్ర‌భావం.సిబ్బంది కొర‌త వంటివి విమాన ప్ర‌యాణాల‌పై ప్ర‌తికూల ప్రభావం చూపుతున్నాయి.

ప్ర‌తీ వీకెండ్‌లో ర‌ద్దీగా ఉండే ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్‌పోర్టులు సైతం సాధార‌ణ ర‌ద్దీతోనే న‌డిచాయి.ఈ కారణం చేత చాలా మంది హాలిడే ప్ర‌యాణాలు నిలిపివేసుకొంటున్న‌ట్టు స‌మాచారం.

శనివారం యూఏఈలో 2,556 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం దేశంలో కరోనా వెలుగు చూసిన నాటి వైరస్ బారినపడిన వారి సంఖ్య 7,64,493కి చేరుకుంది.అలాగే శనివారం కోవిడ్ కారణంగా ఒకరు ప్రాణాలు కోల్పోయారు.

సమంత నాగచైతన్య విడాకులకు పిల్లలే కారణమా.. అసలు విషయం బయటపెట్టిన చైతన్య?
రహస్యంగా పెళ్లి చేసుకున్న టాలీవుడ్ స్టార్ సింగర్లు.. ఈ జోడి క్యూట్ కపుల్ అంటూ?

దీనితో కలిపి యూఏఈలో వైరస్ వల్ల మరణించిన వారి సంఖ్య 2,165కి చేరుకుంది.ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలోనే జనవరి ప్రధాని నరేంద్ర మోడీ యూఏఈలో తన పర్యటనను విరమించుకున్నారు.

Advertisement

షెడ్యూల్ ప్రకారం భారత ప్రధాని 5-6 తేదీల్లో పర్యటించాల్సి వుంది.

తాజా వార్తలు