అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు భారతీయులు దుర్మరణం పాలవ్వగా… మృతుల్లో ఒకరు తెలుగువారు ఉన్నారు.థ్యాంక్స్ గివింగ్ వీకెండ్ లీవ్ నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో విజయవాడకు చెందిన గోపిశెట్టి వైభవ్, జూడీ స్టాన్లీలు మరణించారు.
వైభవ్ టెన్నిస్సీ స్టేట్ యూనివర్సిటీలో ఫుడ్ సైన్స్‌లో పీహెచ్‌డీ చేస్తుండగా జూడీ ఎంఎస్ చేస్తున్నారు.
నోలెన్స్‌విల్ పైక్ వద్ద వాల్‌మార్ట్ నుంచి వైభవ్, జూడీ ప్రయాణిస్తున్న నిస్సాన్ సెంట్రా కారును ఓ ట్రక్కు ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో భారతీయులు ప్రయాణిస్తున్న కారు నుజ్జునుజ్జయ్యింది.ప్రమాదానికి కారణమైన వ్యక్తిని డేవిడ్ టొర్రెస్‌గా గుర్తించారు.పరారీలో ఉన్న అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

జూడీ, వైభవ్‌లను భారతదేశానికి తరలించేందుకు అక్కడి భారతీయ సంఘాలు ప్రయత్నిస్తున్నాయి.వారి మిత్రులు సైతం GoFundMe ద్వారా విరాళాలను సేకరిస్తున్నారు.వీరి మరణవార్త తెలుసుకున్న కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.
కాగా కాలిఫోర్నియాలో భారతీయ విద్యార్ధి అభిషేక్ సుధేశ్ భట్‌ను ఓ దుండగుడు దారుణంగా కాల్చి చంపిన సంగతి తెలిసిందే.కర్నాటకకు చెందిన అతను కాలిఫోర్నియా స్టేట్ వర్సిటీలో కంప్యూటర్ సైన్స్ చదువుతూ, స్థానిక హోటల్‌లో పార్ట్‌టైం ఉద్యోగం చేస్తున్నాడు.