ట్విట్టర్ లో పోస్ట్ అయ్యే ఫేక్ న్యూస్ కి గుడ్ బై చెప్పండి ఇలా..!

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో భాగం అయిన ట్విట్టర్ లో అనేక అసత్య ప్రచారాలు జరుగుతున్న విషయం అందరికి తెలిసిందే.

కరోనా వాక్సిన్ గురించి అనేక తప్పుడు సమాచారాలు సోషల్ మీడియాలో బాగా ప్రచారం అయ్యాయి.

ప్రజలు కూడా అసత్య సమాచారాన్ని విశ్వసించి వాటిని నమ్మి వాక్సిన్ వేయించుకోవడానికి ముందుకు రాలేదు.ఆకతాయిలు ఎదో అసత్య ప్రచారాన్ని పోస్ట్ చేయడం వలన ఇలాంటి న్యూస్ అనేది నెటిజన్లను తప్పుదారి పట్టిస్తుంది.

ఈ క్రమంలోనే తప్పుదారి పట్టించే కంటెంట్‌ ను నిరోధించడానికి ట్విట్టర్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నది.ట్విట్టర్ లో భారీ మార్పులు చేయడంతో పాటు మూడు రకాల వార్నింగ్ లేబుల్స్ ను ప్రవేశపెట్టింది.

తప్పుడు సమాచారాన్ని గుర్తించడానికి ట్విట్టర్ నారింజ, ఎరుపు రంగులను వార్నింగ్ లేబుల్స్ కింద ట్విట్టర్ లో జత చేర్చింది.మొదటి స్థాయి రంగు నీలం రంగులో కనిపిస్తుంది.

Advertisement

ఇది ట్విట్టర్ రంగును పోలి ఉంటుంది.రెండవ స్థాయి రంగు ఎరుపు రంగులో కనిపిస్తుంది.2020 లో అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ట్విట్టర్ లో తప్పుడు సమాచారం ప్రచారం అయినప్పటి నుండి కంపెనీ ఈ విషయం పట్ల ఏదోటి చేయాలనీ భావించింది.

అలా నిపుణుల అభిప్రాయం ప్రకారం ట్విట్టర్ యూజర్లకు సరైన కంటెంట్‌ను అందించడంలో ఈ లేబుల్ సహాయం చేయడంతో పాటు తప్పుడు సమాచారం, ఫోటోలు, వీడియోలు కూడా సులభంగా తొలగించవచ్చట.కాగా ట్విట్టర్‌ తప్పుడు సమాచారాలపై మూడు రకాల వార్నింగ్ లేబుల్‌ను జారీ చేస్తుంది.ఏదైనా తప్పుడు వీడియో లేదా ఆడియోను ఉద్దేశపూర్వకంగా ట్యాంపరింగ్ చేయడం, ఎన్నికలకు సంబంధించిన తప్పుడు సమాచారాలను, కరోనా అసత్య ప్రచారాలను పంచుకుంటే వారికి వార్నింగ్ లేబుల్‌ ను చూపిస్తుందన్నమాట.

అంటే ఇకనుంచి ట్విట్టర్ లో అసత్య ప్రచారాలను ప్రచారం చేసే ఆస్కారం లేదు అన్నమాట.

పోలియోతో రెండు కాళ్లు పడిపోయినా రోజుకు 16 గంటల పని.. వైతీశ్వరన్ సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు