ఏపీ రాజధానిపై ట్విస్ట్.. ఆగస్టు 15 తర్వాత జరగబోయేదేంటి?

రాజకీయాల్లో ఆగస్టు నెల అంటే ఎంతో ప్రాధాన్యత ఉంది.ముఖ్యంగా టీడీపీకి ఆగస్టు నెలను యాంటీ సెంటిమెంట్‌గా ఆ పార్టీ నేతలు భావిస్తారు.

ఎందుకంటే టీడీపీ ఆగస్టు నెలలోనే ఎక్కువ సంక్షోభాలను చవి చూడాల్సి వచ్చింది.దీంతో ఆగస్టు నెల వస్తుందంటే చాలు టీడీపీ నేతలకు చమటలు పట్టేస్తాయి.పార్టీ ప్రారంభమైన నాటి నుంచి టీడీపీ దాదాపుగా ఆగస్టు సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.1984 ఆగస్టులో నాదెండ్ల భాస్కర్ రావు ఎన్టీఆర్‌పై తిరుగుబాటు చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నించారు.పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ఆగస్టు నెలలోనే రెండుసార్లు ముఖ్యమంత్రి పదవిని కోల్పోయారు.1995లో చంద్రబాబు కారణంగా ఆగస్టు నెలలోనే ఎన్టీఆర్ సీఎం పదవి కోల్పోవాల్సి వచ్చింది.అటు 2000వ సంవత్సరం ఆగస్టు నెలలో బషీర్ బాగ్ కాల్పులు జరిగాయి.

దీని వల్ల చంద్రబాబు 2004లో అధికారం కోల్పోయారు.అందువల్ల టీడీపీకి సంబంధించి ఆగస్టు నెలను చెడు శకునంగా పరిగణిస్తారు.

ఇప్పుడు మరోసారి టీడీపీకి ఆగస్టు నెలలోనే ఝలక్ ఇచ్చేలా వైసీపీ పావులు కదుపుతోంది.ఆగస్ట్ నెలాఖరులో వర్షాకాల అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని వైసీపీ సర్కారు భావిస్తోంది.

Advertisement

ఈ సమావేశాలో కీలకమైన బిల్లులను సభలో ప్రవేశపెడతారని టాక్ నడుస్తోంది.అందులో రాజధానికి సంబంధించిన బిల్లు కూడా ఉంటుందని సమాచారం.

ఇటీవల మంత్రి ఆదిమూలపు సురేష్ ఆగస్టు నెలలో కీలక పరిణామాలు జరగబోతున్నాయని సంకేతాలు ఇచ్చారు.రాజధాని విషయంలో ఆగస్టులో ఏం జరుగుతుందో మీరే చూస్తారంటూ టీడీపీకి హెచ్చరికలు పంపించారు.మంత్రి సురేష్ వ్యాఖ్యలను పరిశీలిస్తే ఆగస్టులో ఏదో జరగబోతుందని.

వైసీపీ పక్కా ప్లాన్‌తో ముందుకెళ్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.మూడు రాజధానుల్లో భాగంగా కర్నూలు జ్యుడిషియరీ క్యాపిటల్ కాబట్టి అక్కడికి హైకోర్టు తరలించే విధంగా జగన్ ప్రభుత్వం బిల్లు ప్రవేశ పెడుతుందని ప్రచారం సాగుతోంది.

జగన్ అనుకున్న విధంగా ఈ బిల్లు పాస్ అయితే మాత్రం ఆగస్టు యాంటీ సెంటిమెంట్ మళ్లీ టీడీపీకి షాక్ ఇస్తుందనే చెప్పాలి..

హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?
Advertisement

తాజా వార్తలు