వేణు స్వామిని బ్లాక్ మెయిల్ చేస్తున్న ప్రముఖ జర్నలిస్ట్‌.. ఛీ ఛీ మీడియా అసలు రంగు ఇదేనా?

తాజాగా ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి( Astrologer Venu Swamy ) ఒక వీడియో రిలీజ్ చేసి సంచలన ఆరోపణలు చేశారు.జర్నలిస్టు మూర్తి( Journalist Murthy ) 2017లో మహా టీవీలో ఉన్నప్పుడు నుంచి తనపై దాడి చేయడం మొదలుపెట్టారు అని వేణు స్వామి అలిగేషన్స్ చేశారు.

జర్నలిస్టు మూర్తి అడిగిన డబ్బులు తాను ఇవ్వకపోవడం వల్లే ఆయన తనని టార్గెట్ చేయడం స్టార్ట్ చేశాడని వేణు స్వామి ప్రస్తుతం ఆరోపిస్తున్నారు.8 నెలల నుంచి ఆయన తన టీమ్‌తో కలిసి తనని బాగా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని లేటెస్ట్ వీడియోలో చెప్పుకొచ్చారు."సోషల్ మీడియాలో నా గురించి చర్చలు పెట్టి నా గురించి తప్పుడు ప్రచారాలు చేయడానికి జర్నలిస్టు మూర్తి చాలా ప్రయత్నిస్తున్నారు.

ఆయన చేస్తున్న టార్చర్ తట్టుకోలేక సూసైడ్ చేసుకునే స్థితికి నేను చేరుకున్నా.గత ఎనిమిది నెలల్లో నేను 15 కిలోల బరువు తగ్గిపోయా." అని వేణు స్వామి చాలా ఎమోషనల్ గా మాట్లాడారు.

అంతేకాదు జర్నలిస్టు మూర్తి టీమ్ తనని ఎలా బ్లాక్ మెయిల్ చేస్తుందో వినండి అంటూ ఒక ఆడియో కూడా తన వీడియోలో వినిపించారు.ఆ ఆడియో ఫైల్‌లో టీవీ5 జర్నలిస్టు మూర్తి అనుచరుడు జర్నలిస్టు అమర్( Journalist Amar ) రూ.5 కోట్ల గురించి ఒక మహిళతో మాట్లాడుతున్నట్లుగా తెలిసింది.మూర్తి జర్నలిస్ట్ అమర్ ద్వారా అయిదు కోట్లు డిమాండ్ చేస్తే, దానిని వేణు స్వామి నుంచి అలా అడగాలి అన్నట్టుగా అమర్‌ను ఆమె ప్రశ్నించడం వినిపించింది.

ఏ లాజిక్ లో వేణు స్వామి ఐదు కోట్లు ఇవ్వాలో చెప్తే బాగుంటుంది కదా అన్నట్టు ఆమె ప్రశ్నించింది.తర్వాత ఈ అమౌంట్ ఎవరికి వెళ్తుంది అని ప్రశ్నించింది.

Advertisement

ఇందులో బి.ఆర్ నాయుడు, ప్రేమ, రాంబాబు వంటి వారికి కూడా కొంత అమౌంట్ పోతుందా? అని ఆ మహిళ అడిగితే ఆ వెళ్తుంది అన్నట్లు అమర్ చెప్పాడు.

వీరందరూ కలిసి వేణు స్వామి పై అటాక్ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు అమర్ ఒప్పుకున్నాడు.వీళ్ళందరికీ డబ్బులు ఇస్తేనే వాళ్లు కామ్‌ అయిపోతారు, ఆ తర్వాత ఈ ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది అన్నట్టుగా డిమాండ్ చేశాడు.అయితే ఆ మహిళ మాత్రం వేణు స్వామిని తాను దగ్గర నుంచి చూస్తున్నట్లుగా చెప్పింది.

అతను ఐదు కోట్లు ఇచ్చే ఆర్థిక స్తోమతలో లేదని కూడా స్పష్టం చేసింది.అలాంటప్పుడు 50 లక్షలు లేదంటే ఒక కోటి రూపాయలు ఇచ్చి సెటిల్ చేయొచ్చు కదా, ఆయన ఏం మాట్లాడకపోతే ఏమని అర్థం చేసుకోవాలి అని అమర్ ప్రశ్నించాడు.

ఈ ఆడియో ఫైల్ ముగిసిన తర్వాత వేణు స్వామి భార్య( Venu Swamy Wife ) మండిపడ్డారు.బ్లాక్ మెయిల్ చేసే ఇలాంటి నీచులను బయట పెట్టడానికి తాము ఈ వీడియో చేస్తున్నామని పేర్కొన్నారు.ఇది బ్లాక్ మెయిల్ కాదని ఇన్ డైరెక్ట్‌ మర్డర్ అని కూడా ఆమె ఆమె షాకింగ్ కామెంట్స్ చేశారు.

కమల్ హాసన్ భారతీయుడు 3 తో మరోసారి నట విశ్వరూపాన్ని చూపించబోతున్నాడా..?
కీర్తి సురేష్ పెళ్లి చీర కోసం అన్ని గంటలు కష్టపడ్డారా.. ఆ చీర ప్రత్యేకత ఏంటో తెలుసా?

చాలా డీసెంట్ గా ఉండే జర్నలిస్టులు కూడా వాటాలు మాట్లాడుకుంటూ ఒక వ్యక్తిని ఇలా హింసించడం నమ్మలేకపోతున్న అని ఆమె మాట్లాడారు.పరువు కోసం రేపు పొద్దున చచ్చిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ అని ఆమె క్వశ్చన్ చేశారు.

Advertisement

ఇప్పుడు ఈ వీడియో తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.

తాజా వార్తలు