యవ్వనంలో వచ్చే సమస్యలకు పరిష్కారం...తులసి

ఆరోగ్యానికి తులసి చేసే మేలు అంతా ఇంతా కాదని మనకు తెలిసిందే.అలాగే సౌందర్య పోషణలో కూడా కీలకమైన పాత్రను పోషిస్తుంది.

ఇప్పుడు మనకు నిత్యం అందుబాటులో ఉండే తులసితో అందానికి ఎలా మెరుగులు దిద్దుకోవాలో తెలుసుకుందాం.తులసి ఆకులను తీసుకోని మెత్తని పేస్ట్ గా చేసుకోవాలి.

Tulsi Beauty Benefits-Tulsi Beauty Benefits-Telugu Health-Telugu Tollywood Photo

ఈ పేస్టులో పావు స్పూన్ పాలపొడి,కొంచెం నీటిని కలుపుకోవాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి,మెడకు రాసి 15 నిముషాలు అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.

వారంలో రెండు సార్లు ఈ విధంగా చేస్తే మంచి ఫలితాన్ని పొందవచ్చు.యవ్వనంలో మొటిమల సమస్య ఎక్కువగా ఉంటుంది.

Advertisement

ఈ సమస్య పరిష్కారానికి తులసి బాగా సహాయపడుతుంది.పది తులసి ఆకులు,మూడు వేపాకులు, గందం పొడి,నాలుగు స్పూన్ల రోజ్ వాటర్ కలిపి మెత్తని పేస్ట్ గా చేయాలి.

ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి ఆరాక చల్లని నీటిని చల్లుతూ మసాజ్ చేస్తూ శుభ్రం చేయాలి.గుప్పెడు తులసి ఆకులను మెత్తగా చేసుకోవాలి.

ఈ పేస్ట్ కి కొంచెం టమోటా గుజ్జు,ఒక స్పూన్ తేనే కలిపి ముఖానికి రాసుకోవాలి.ప్రతి రోజు ఉదయాన్నే రాసుకుంటే ముఖం మీద ఉన్న జిడ్డు తొలగిపోతుంది.

బిగ్ బాస్ షో ఎలా పుట్టిందో మీకు తెలుసా?
Advertisement

తాజా వార్తలు