సమ్మె కొనసాగించి తీరుతాం

తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెపై పునరాలోచించాలంటూ హై కోర్టు సూచించిన విషయం తెల్సిందే.

ప్రభుత్వం నుండి ఎలాంటి సానుకూలత రాకపోవడంతో ఆర్టీసీ కార్మికుల్లో కూడా ఒకరకమైన నైరాశ్యం మొదలైంది.

దాదాపు నెలన్నర రోజులుగా సమ్మె చేస్తున్నా కూడా ప్రభుత్వం పట్టించుకోక పోవడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆర్టీసీ కార్మికులు కోర్టు సూచన తర్వాత సమ్మె విరమించేందుకు సిద్దం అయ్యింది అంటూ ప్రచారం జరిగింది.మీడియాలో వార్తల అనుసారం కార్మికులు అతి త్వరలో సమ్మె విరమిస్తారని అంతా అనుకున్నారు.

నేడు జరిగిన జేఏసీ భేటీలో సమ్మెపై ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు చర్చలు జరిపారు.కర్మిక సంఘాల నాయకులు అంతా కలిసి సమ్మెను కొనసాగించాల్సిందే అంటూ నిర్ణయించుకున్నారు.

డిపోల్లో నిర్వహించిన అభిప్రాయ సేకరణలో కూడా కార్మికులు జేఏసీ నేతల నిర్ణయంకు కట్టుబడి ఉంటామంటూ ప్రకటించారు.దాంతో ముందుగా అనుకున్న నిరసన కార్యక్రమాలను ఆర్టీసీ కంటిన్యూ చేయబోతుందని ఈ సందర్బంగా ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నాయకుడు అశ్వథ్థామరెడ్డి అన్నారు.

Advertisement

ఆర్టీసీ సమ్మె ముగుస్తుందనుకుంటే మళ్లీ మొదటికి రావడంతో అంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పోలియోతో రెండు కాళ్లు పడిపోయినా రోజుకు 16 గంటల పని.. వైతీశ్వరన్ సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు