టీఆర్ఎస్ కాంగ్రెస్ పొత్తు ? ప్రత్యక్షంగానా పరోక్షంగానా ?

తెలంగాణ లో రాజకీయ సమీకరణాలు శర వేగంగా మారుతున్నాయి.ముఖ్యంగా  తెలంగాణలో ప్రధాన శత్రువులు గా కొనసాగుతున్న టీఆర్ఎస్ , కాంగ్రెస్ మధ్య పొత్తు చిగురించే అవకాశం ఉన్నట్టుగా సంకేతాలు వెలువడుతున్నాయి .

 Trs, Congress, Bjp, Telangana, K Keswarao, Parlament, Lok Sabha, Rajyasabha, Cen-TeluguStop.com

ముఖ్యంగా ఈ విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా చొరవ తీసుకుంటున్నట్లు గా కనిపిస్తున్నారు.ఏడేళ్లుగా కాంగ్రెస్ టీఆర్ఎస్ మధ్య రాజకీయ పోరు కొనసాగుతునే ఉంది.

  నిత్యం టీఆర్ఎస్ ప్రభుత్వ  తప్పిదాలను ఎత్తి చూపిస్తూ,  కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తూ వస్తున్నారు.  ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి దూకుడుగానే ఉంటూ వస్తున్నారు.

కాంగ్రెస్ ను బలహీనం చేస్తే తెలంగాణలో తిరుగే ఉండదనే ఆలోచనతో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ నుంచి 12 మంది ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకుని అనుకున్నట్లుగానే కాంగ్రెస్ ను బలహీనం  చేయగలిగింది.అయితే ఈ పరిణామాలు బీజేపీకి బాగా కలిసి వచ్చాయి.

కాంగ్రెస్ బాగా బలహీనపడడంతో బీజేపీ  తెలంగాణలో బలం పుంజుకునేలా,  టీఆర్ఎస్ కు సవాల్ విసిరి 2023 ఎన్నికల్లో గెలిచే శక్తి సామర్ధ్యాలను సంపాదించుకోగలిగింది.

ఈ పరిణామాలన్నీ టీఆర్ఎస్ లో కలవరం పుట్టిస్తున్నాయి.

దీనికితోడు ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్ ఎప్పుడూ లేని విధంగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.  కేంద్ర మంత్రులను పరుష పదజాలంతో దూషిస్తున్నారు.

చేతగాని ప్రభుత్వం అంటూ కేంద్రాన్ని విమర్శిస్తున్నారు.ఇక పూర్తిగా బీజేపీ విషయంలో సానుకూల వైఖరి ఉండదని సంకేతం కేసీఆర్ పంపించారు.

బీజేపీ దూకుడుకు అడ్డుకట్ట వేయాలంటే కాంగ్రెస్ తో స్నేహం చేయడం ఒక్కటే మార్గంగా కేసీఆర్ అభిప్రాయపడుతున్నారు.ఈ నేపథ్యంలోనే ప్రస్తుత పార్లమెంట్ శీతాకాల సమావేశాల ల్లో  అనుసరించాల్సిన వ్యూహాలపై పద్నాలుగు విపక్ష పార్టీలతో నిర్వహించిన సమావేశానికి టీఆర్ఎస్ తరఫున లోక్ సభ, రాజ్యసభ సభ్యులు హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది.

కాంగ్రెస్ నిర్వహించిన సమావేశానికి టీఆర్ఎస్ హాజరు అవుతుందని ఎవరూ ఊహించలేదు.

Telugu Amith Sha, Central, Congress, Keswarao, Lok Sabha, Modhi, Rajyasabha, Tel

బీజేపీ వ్యతిరేక పార్టీ లను కూడగట్టి జాతీయ స్థాయిలో ఆ పార్టీ అధికారంలోకి రాకుండా చేసేందుకు కేసీఆర్ వ్యూహం పన్నుతున్నట్లు అర్థం అవుతుంది .అందుకే కాంగ్రెస్ తోనూ స్నేహం చేసేందుకు ప్రయత్నాలు చేయడం దీనిలో భాగంగానే కనిపిస్తుంది.  అయితే రాబోయే ఎన్నికల వరకు ఈ స్నేహాన్ని కొనసాగిస్తారా ?  ఎన్నికల సమయంలో నేరుగా కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలు పొత్తు పెట్టుకుంటాయా అనేది తేలాల్సి ఉంది.టీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య స్నేహం చిగురించేలా టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు కీలకంగా వ్యవహరిస్తున్నారు.కాంగ్రెస్ అధిష్టానం పెద్దలతోనూ, ఆ పార్టీ సీనియర్ నాయకులతోనూ కేశవరావు ఇప్పటికీ మంచి సత్సంబంధాలు ఉన్నాయి.దీంతో ఆయన ఈ వ్యవహారాన్ని ఒక కొలిక్కి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారట.

అయితే ఈ పరిణామాలన్నీ తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కి మింగుడు పడని అంశంగా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube