వ్యవసాయ చట్టాల రద్దుతో టీఆర్ఎస్ ఖుషీ.. అసలు కారణమిదే

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన  వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాన మంత్రి మోడీ ప్రకటించిన విషయం తెలిసిందే.

అయితే ఈ వ్యవసాయ చట్టాల రద్దుతో ఒకసారిగా దేశమంతా ఆశ్చర్యపోయిన పరిస్థితి ఉంది.

అయితే ఈ వ్యవసాయ చట్టాల రద్దుతో ఒక్కసారిగా తెలంగాణలో రాజకీయ పరిస్థితి మారేలా కనిపిస్తోంది.అయితే నరేంద్రమోడీ దేశాన్ని ఉద్దేశించి మాట్లాడిన తరువాత   మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నిర్వహించిన విలేఖరుల సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు.

కెసీఆర్ ఎంతటి పోరాట పటిమ కలిగిన వ్యక్తి అనేది నరేంద్ర మోడీకి తెలుసునని, గురువారం నిర్వహించిన రైతు మహా ధర్నాలో రైతుల పక్షాన టీఆర్ఎస్ పోరాటం చేయనుందని ప్రకటించిన నేపథ్యంలోనే నరేంద్రమోడీ వ్యవసాయ చట్టాలను రద్దు చేశారని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.అంతేకాక ఇప్పటికైనా బీజేపీ నేతలు చిల్లర మాటలు మాట్లాడటం మానుకొని బాధ్యత గల ప్రతిపక్షంగా నడుచుకోవాలని అన్నారు.

అయితే ఈ వ్యవసాయ చట్టాల రద్దుతో టీ ఆర్ఎస్ పెద్ద ఎత్తున ఖుషీగా ఉన్న పరిస్థితి ఉంది.ఎందుకంటే టీఆర్ఎస్ ధర్నా నిర్వహించిన తరువాతి రోజు ఈ వ్యవసాయ చట్టాల రద్దు నిర్ణయం రావటం అంతేకాక ఆ ధర్నాలో ఇక భవిష్యత్తులో రైతుల సమస్యల పరిష్కారానికి టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఉద్యమం చేపడతామని ప్రకటించిన నేపథ్యంలోనే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వెనక్కి తగ్గరని ఇది కెసీఆర్ స్థాయి అని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.

Advertisement

అయితే దీనిని ఇక కెసీఆర్ బీజేపీపై అస్త్రంగా మలుచుకునే అవకాశం ఉంది.ఇక బీజేపీ రైతుల సమస్యల గురించి మాట్లాడితే రైతులకు అన్యాయం చేశామని మీ ప్రధాని క్షమాపణ చెప్పారని ఇంకా మీరు రైతుల సంక్షేమం గురించి మాట్లాడతారా అంటూ విమర్శనాస్త్రాలు సంధించే అవకాశం ఉంది.

హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?
Advertisement

తాజా వార్తలు