ఇక అభివృద్ధిపై టీఆర్ఎస్ ఫోకస్... అంతర్మధనంలో ప్రతిపక్షాలు

టీఆర్ఎస్ అధినేత కెసీఆర్ ఇప్పుడు అభివృద్ధిపై ఫోకస్ పెట్టడం జరిగింది.

ఇక ఒకటిన్నర, రెండు సంవత్సరాలలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న పక్షంలో సంక్షేమ కార్యక్రమాలు, అన్ని వర్గాల అభ్యున్నతికై రకరకాల పథకాలను ప్రవేశ పెడుతున్న సంగతి మనం చూస్తున్నాం.

అయితే కెసీఆర్ లాంటి రాజకీయ అపరఛాణక్యుడు వ్యూహాలను అర్థం చేసుకోవడం అంత సులభం కాదనేది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.అయితే ఇప్పటికే నేతన్నలకు రైతులు ఎవరైనా మరణిస్తే ఎలాగైతే రైతు బీమా వస్తుందో, అలా చేనేత కార్మికులకు చేనేత బీమా కూడా కల్పిస్తామని కెసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే.

అయితే పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి ద్వారా మరింత అభివృద్ధి పరచాలనే ఉద్దేశ్యంతో నిధులు మంజూరు చేస్తూ టీఆర్ఎస్ పట్ల ప్రజలలో అనుకూల పవనాలు వీయాలనే ఉద్దేశ్యంతో పథకాలను అమలు పరుస్తున్నారు కెసీఆర్.అయితే ఇపుడు కెసీఆర్ అనుసరిస్తున్న ఈ విధానాలతో ప్రతిపక్షాలు అంతర్ మథనం చెందుతున్నట్లు తెలుస్తోంది.

ఎంతో కష్టపడి టీఆర్ఎస్ పై వ్యతిరేకత సృష్టిస్తే మరలా ప్రజాకర్షక పథకాలతో కెసీఆర్ ముందుకు రావడం ప్రతిపక్షాలకు కొంత ఇబ్బందిగా మారినట్లు తెలుస్తోంది.ఇప్పటికే కెసీఆర్ కు ధీటుగా పెద్ద ఎత్తున వ్యూహాలు రచిస్తున్న ప్రతిపక్షాలు ఎంతమేర సక్సెస్ అవుతాయనేది భవిష్యత్తులో చూడాల్సి ఉంది.

Advertisement
కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?

తాజా వార్తలు