ఈటెల రాజేందర్ ఆషామాషీ వ్యక్తి కాదు అని, ఆయన తలుచుకుంటే టిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం శక్తిగా తెలంగాణలో కొత్త పార్టీ పెట్టి తన సత్తా ఏంటో నిరూపించగల వ్యక్తి అనే విషయం అందరికీ అర్థమైపోయింది.టిఆర్ఎస్ మంత్రిగా కెసిఆర్ ఆజ్ఞలను పాటిస్తూ వచ్చిన ఆయన ఉద్యమ కాలం నుంచి టిఆర్ఎస్ కు క్రమశిక్షణ కలిగిన సైనికుడిగా పని చేశారు.
కేసీఆర్ కు ఆర్థికంగానూ, అండదండలు అందించారు.అయితే ఆ తర్వాత తెలంగాణ ఏర్పడం, టిఆర్ఎస్ గెలవడం మొదటి సారి టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఈటెల కు తగిన గౌరవం మర్యాద లు ఇవ్వడం అన్ని జరిగిపోయాయి .కానీ రెండో సారి మాత్రం లెక్క తప్పింది.కెసిఆర్ ఈటెల ప్రాధాన్యత తగ్గించడం అలాగే ఈటెల సైతం అసంతృప్తి తో మాట్లాడడం, ఇక కొద్ది రోజుల క్రితం ఆయనను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడం వంటి ఎన్నో కీలక పరిణామాలు జరిగిపోయాయి.
ఇప్పుడు ఆయన కొత్త పార్టీ స్థాపించబోతున్నారనే ప్రచారం కావడంతో, టిఆర్ఎస్ లో ఉన్న అసంతృప్తి నేతలు అంతా ఈటెల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు .అలాగే కాంగ్రెస్, బీజేపీ లోని అసంతృప్తి నేతల్ని సైతం కలుస్తూ, మీ వెనక మేము ఉంటాము అంటూ భరోసా ఇస్తున్నారు.అలాగే ఉద్యమ సమయంలో కీలకంగా వ్యవహరించిన వారు ఇప్పుడు ఈటెలకు మద్దతు పలుకుతున్నారు.దీంతో ఈటెల రాజేందర్ అషామాశి వ్యక్తి కాదన్న విషయం టిఆర్ఎస్ పెద్దలకు అర్థమయిపోయింది.
ఒక నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం ఆయన ముందుకు వెళుతున్నారని టిఆర్ఎస్ పెద్దలకు అర్థమయిపోయింది.ఇక దీనికి తగ్గట్టుగానే ఈటెల రాజేందర్ సైతం చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు.ఇటీవలే ఎన్.ఆర్.ఐ ల తో ఈటెల సమావేశం అయ్యారు.ఈ సందర్భంగా తమ సంపూర్ణ మద్దతు మీకే ఉంటుందంటూ వారంతా హామీ ఇచ్చారు .

అలాగే టిఆర్ఎస్ వీడి బయటకు వెళ్ళిన నాయకులు ఈటెల ను కలుస్తున్న వారిలో ఉన్నారు.ఇటీవల ఏనుగు రవీందర్ రెడ్డి అనే మాజీ ఎమ్మెల్యే భేటీ అయ్యారు.అలాగే కాంగ్రెస్, బిజెపి నుంచి కొంతమంది కీలక నాయకులు ఈటెల ను పార్టీ పెట్టాల్సిందిగా ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది.దీనికి తగ్గట్టుగానే కొత్త పార్టీ ఏర్పాటు చేసేందుకు ఈటెల ముందుగానే తెలంగాణలోని అన్ని జిల్లాల వారీగా తమతో కలిసి వచ్చే నాయకుల లిస్ట్ సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
మరికొద్ది రోజుల్లోనే రాజకీయంగా కీలక నిర్ణయం తీసుకునేందుకు ఈటెల సిద్దమవుతుండటంతో టిఆర్ఎస్ లో ఆందోళన నెలకొంది.