మురికి గుంటలో దిగిన వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

నెల్లూరు: మురికి గుంటలో దిగిన వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.ఉమ్మారెడ్డి గుంటలో డ్రైనేజీ సమస్య అధికంగా ఉందని ఆవేదన.

రైల్వే, కార్పొరేషన్ అధికారులు ఒకరిపై ఒకరు చెప్పుకుంటున్నారన్న ఎమ్మెల్యే.ప్రజలకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత తనపై ఉందని కాలువలో దిగి నిరసన.

మూడు రోజుల్లో కాలువ పనులు ప్రారంభిస్తున్నామన్న అధికారులు.కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కామెంట్స్.21వ డివిజన్ ఉమ్మారెడ్డి గుంటలో డ్రైనేజీ సమస్య ఎక్కువగా ఉంది.వందల కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి.

ఎగువ ప్రాంతాల నుంచి భారీగా మురుగునీరు వచ్చి చేరుతుంది.ఈ సమస్య అనేక సంవత్సరాలుగా ఉంది, ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఎప్పుడో ప్రశ్నించా.

Advertisement

రైల్వే, కార్పొరేషన్ అధికారులు ఒకరిపై ఒకరు చెప్పుకున్నారు.అధికారంలోకి వచ్చిన మూడేళ్ళ నుంచి కూడా అధికారులతో మాట్లాడుతూ ఉన్నాను.

అధికారులు పట్టించుకోవడం లేదు, ఇవాళ ఇక్కడ పర్యటించాను.ప్రజాసమస్యల పరిష్కార విషయంలో అధికారమా, ప్రతిపక్షమా అని ఉండదు.

ప్రజల పక్షాన ఉంటాను.అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, నేను కూడా బాధపడుతున్న.

డ్రైన్ల నిర్మాణాలు.రైల్వే అధికారులు మొండి తీరు, కార్పొరేషన్ అధికారుల నత్తనడకని ప్రశ్నిస్తూ మురుగు గుంట దిగాను.

కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?
Advertisement

తాజా వార్తలు