నెగటివ్ రాగానే కూతురుకు కిస్సులు ఇచ్చిన మంచు లక్ష్మి.. తిట్టిపోస్తున్న నెటిజన్స్!

మంచు లక్ష్మి తెలుగు ప్రేక్షకులలో ఈ పేరు వినని వారు ఉండరు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

మోహన్ బాబు కుమార్తె గా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి వెండితెరపై పలు సినిమాల్లో నటించి నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకుంది.

మంచు లక్ష్మి నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించి, తన వ్యక్తిగత విషయాలకు సంబంధించి, అలాగే తన ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.ఈ క్రమంలోనే ఈమె ఎక్కువగా సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ కి సైతం గురవుతూ ఉంటుంది.

అలాగే పలు సామాజిక అంశాలపై కూడా తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటుంది.ఇక తనపై ఎన్ని రకాల ట్రోలింగ్స్ జరిగినా కూడా అవన్నీ పట్టించు కోకుండా వెళ్తూ ఉంటుంది.

ఇది ఇలా ఉంటే తాజాగా కరోనా విషయంలోనూ ఆమె వ్యవహారించిన శైలి నెటిజన్ లకు కోపం తెప్పించింది.అసలేం జరిగిందంటే.

Advertisement

ఇటీవలే మంచు లక్ష్మి కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.ఇదే విషయాన్ని మంచు లక్ష్మి స్వయంగా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించింది.

గో కరోనా గో అని గట్టిగా అరిచినా కూడా అది తనను పట్టుకుంది అంటూ కాస్త ఫన్నీగా తనకు కరోనా సోకిన విషయాన్ని తెలిపింది మంచులక్ష్మి.ఇది ఇలా ఉంటే తాజాగా మంచు లక్ష్మి కి కరోనా నెగిటివ్ రావడంతో కాస్త డిఫరెంట్ గా ఆలోచించి నెటిజన్ ల ట్రోలింగ్స్ కి గురయ్యింది.

తనకు నెగిటివ్ వచ్చిన విషయాన్ని తన అభిమానులతో ఈ విధంగా చెప్పుకొచ్చింది.

అందరికీ నమస్కారం.నాకు నెగిటివ్ వచ్చేసింది.అంటూ తెగ సంబర పడిపోతూ మంచు లక్ష్మి తెలిపింది.

హెచ్‎సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్..!
హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

ఇక వెంటనే తన కూతురు విద్యా నిర్వాణకు లిప్ కిస్సు లు ఇచ్చింది.అందుకు సంబంధించిన వీడియోని తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది.

Advertisement

అయితే ఆమెకు నెగిటివ్ రావడం సంతోషించాల్సిన విషయమే కానీ ఆమె చేస్తున్న పనులు సరైనవి కావు అంటూ నెటిజన్స్ తనపై ట్రోలింగ్ చేశారు.కరోనా నెగెటివ్ వచ్చినా కూడా చిన్న పిల్లతో అంత దగ్గరగా ఉంటూ ముద్దులు పెట్టడం సరికాదని అంటున్నారు నెటిజన్లు.

ఇంకొందరు నెటిజన్లు అయితే మరో అడుగు ముందుకేసి మంచు లక్ష్మి ప్రవర్తనను ఏకిపారేస్తున్నారు.

తాజా వార్తలు