కారణం ఏంటో.. అల్లు అర్జున్‌ ను ఆఫీస్‌ కు వెళ్లి కలిసిన త్రివిక్రమ్‌

మాటల మాంత్రికుడు ప్రస్తుతం మహేష్ బాబు డేట్ల కోసం వెయిట్‌ చేస్తున్నాడు.

ఈ గ్యాప్‌ లో పవన్ కళ్యాణ్‌ ప్రస్తుతం సాగర్ చంద్ర దర్శకత్వంలో చేస్తున్న సినిమా సెట్స్ లో సందడి చేస్తున్నాడు.

ఆ సినిమాకు త్రివిక్రమ్‌ స్క్రీన్‌ ప్లే మరియు మాటలు అందిస్తున్న విషయం తెల్సిందే.అందుకే సినిమాకు సంబంధించినంత వరకు పెద్ద ఎత్తున అంచనాలున్నాయి.

ఇక మహేష్‌బాబుతో సినిమా కోసం స్క్రిప్ట్‌ ను పూర్తి చేసి నటీ నటుల ఎంపిక కూడా చేస్తున్నాడు.బిజీగా ఉండే త్రివిక్రమ్‌ నిన్న అల్లు అర్జున్‌ ఆఫీస్ కు వెళ్లాడు.

అక్కడ కొద్ది సమయం అల్లు అర్జున్ తో ఆయన టీమ్‌ తో టైమ్‌ ను స్పెండ్‌ చేయడం జరిగిందట.అందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

Advertisement

ఉన్నట్లుండి వీరిద్దరు కలవడం వెనుక ఉద్దేశ్యం ఏంటా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.అల్లు అర్జున్‌ తో ఇప్పటికే మూడు సినిమాలు చేసిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ మరో సినిమాను కూడా చేయబోతున్నాడా అంటే ఔను అనే సమాధానం వినిపిస్తుంది.పెద్ద ఎత్తున అంచనాలున్న ఆ సినిమా ఇప్పట్లో రాకపోవచ్చు.

కాని వీరిద్దరు కలయికకు మాత్రం వీరి కాంబోలో వచ్చిన జులాయి.వీరి కాంబోలో వచ్చిన మొదటి సినిమా జులాయి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

ఆ సినిమా విడుదల అయిన రోజు అయిన ఆగస్టు 9 న చిన్న పార్టీని అల్లు అర్జున్‌ ఏర్పాటు చేయడం తో త్రివిక్రమ్‌ హాజరు అయ్యాడు అంటూ సమాచారం అందుతోంది.మొత్తానికి వీరిద్దరి కలయిక ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఆసక్తికర చర్చను రేకెత్తిస్తుంది.

మహేష్‌ తో మూవీ తర్వాత బన్నీతో సినిమాను చేయాలని చాలా మంది త్రివిక్రమ్‌ ను కోరుతున్నారు.

అల్లు అర్జున్ అరెస్టు పెద్ద కుట్ర ఉంది.. సింగర్ కల్పన షాకింగ్ కామెంట్స్?
Advertisement

తాజా వార్తలు