చిన్న సినిమాకి కథ అందిస్తున్న మాటల మాంత్రికుడు

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తాజాగా అల వైకుంఠపురం సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్నాడు.

ఇక ఇప్పుడు ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి స్క్రిప్ట్ ని సిద్ధం చేస్తున్నాడు.

స్టార్ దర్శకుడుగా ఉన్న త్రివిక్రమ్ స్టామినా ఏంటో ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ఇక టాలీవుడ్ బడా దర్శకులు కథలు రాసినపుడు అవి చిన్న హీరోకి సరిపోతాయి అనుకున్నప్పుడు తమ శిష్యులని దర్శకులుగా పరిచయం చేస్తూ వాళ్ళే కథ అందించి హోం ప్రొడక్షన్ లో సినిమాలు నిర్మిస్తూ ఉంటారు.

ఇప్పుడు అదే దారిలో త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా చేస్తున్నారు.ఇప్పటికే చల్ మోహన్ రంగా సినిమా కథని నితిన్ కోసం అందించిన ఆ సినిమా అనుకున్న స్థాయిలో వర్క్ అవుట్ అవ్వలేదు.

అయితే ఇప్పుడు మరోసారి తాను కథ అందిస్తూ తన హోం ప్రొడక్షన్ అయిన హారికా హాసినీ క్రియేషన్స్ లో చిన్న బడ్జెట్ సినిమా చేస్తున్నాడు.అయితే దానికి కేవలం తాను కథ మాత్రమే అందించబోతున్నాడు.

Advertisement

దర్శకుడు ఎవరన్నది ఇంకా తెలియరాలేదు.తన అసిస్టెంట్ ని ఈ సినిమాతో దర్శకుడుగా పరిచయం చేసే అవకాశం ఉందని తెలుస్తుంది.

జూనియర్ ఎన్టీఆర్ పేరు బాలయ్యకు నచ్చదా.. తన తండ్రి పేరు దక్కడం బాలయ్యకు ఇష్టం లేదా?
Advertisement

తాజా వార్తలు