నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వి’ ప్రస్తుతం రిలీజ్‌కు రెడీగా ఉంది.ఈ సినిమాతో మరోసారి తనదైన మార్క్ వేసేందుకు నాని రెడీ అవుతున్నాడు.
ఇంద్రగంటి మోహన్‌కృష్ణ డైరెక్ట్ చేస్తున్న ఈ సస్పెన్స్ థ్రిల్లర్‌లో నానితో పాటు మరో యంగ్ హీరో సుధీర్ బాబు కూడా నటిస్తున్నాడు.అయితే ఈ సినిమాలో నాని విలన్ పాత్రలో నటిస్తుండటంతో ఫోకస్ మొత్తం మనోడిపై పడింది.
నానికి ఈ సినిమాలో హీరోయిన్‌తో రొమాన్స్ చేసే ఛాన్స్ ఉందా లేదా? అనేది ఆసక్తిగా మారింది.
తాజాగా రిలీజ్ అయిన ఓ పోస్టర్ కూడా ఇదే సందేహం లేవనెత్తింది.
ఈ సినిమాలో నివేదా థామస్, అదితిరావు హైదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు.వీరిలో నివేదాతో కలిసి సుధీర్ బాబు రొమాన్స్ చేస్తున్న పోస్టర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.
దీంతో ఈ సినిమాలో నానికి హీరోయిన్ లేదా అనేది చర్చనీయాంశంగా మారింది.వరుస మర్డర్లు చేసే కిల్లర్‌గా నాని నటిస్తుండగా, అతడిని పట్టుకునే పోలీస్ పాత్రలో సుధీర్ బాబు నటిస్తున్నాడు.
మరి నివేదా సుధీర్ బాబుకు జోడీ అయితే నానికి అదితి జోడీ అవుతుందా? లేక హీరోయిన్ లేకుండానే నాని పాత్రను చూపించనున్నారా? అనే ప్రశ్నలు ప్రస్తుతం ప్రేక్షకులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.మొత్తానికి ఈ సినిమా కథే కాకుండా పోస్టర్‌లతో కూడా సస్పెన్స్‌ను క్రియేట్ చేస్తున్నారు చిత్ర యూనిట్.
ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం దొరకాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.







