లంబసింగిలో రిసార్ట్స్ ప్రారంభించిన పర్యాటకశాఖ మంత్రి రోజా....

అల్లూరి జిల్లా ఆంధ్ర కశ్మీర్ లంబసింగిలో పర్యాటకశాఖ నిర్మించిన రిసార్ట్స్ పర్యాటకశాఖ మంత్రి రోజా ప్రారంభించారు.

దీంతో సోమవారం నుంచి సందర్శకులకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాను ఉన్నాయి.

పర్యాటకశాఖ సుందరంగా తీర్చిది ద్దిన ఈ రిసార్ట్ల్న ఆదివారం పర్యాటకశాఖ మంత్రి ఆర్కే రోజా అధికారికంగా ప్రారంభించారు.పర్యాటకులకు అధికారులు వసతి కల్పించాలనే లక్ష్యంతో నాటి తెలుగుదేశం ప్ర భుత్వం రిసార్ట్స్ నిర్మాణాల కోసం 2018 మేలో రూ.5 కోట్ల నిధులను మంజూరుచేసింది.రెవెన్యూ అధికారులు లంబసింగి- లబ్బంగి ప్రధాన రహ దారిలో 18 ఎకరాల స్థలాన్ని రిసార్ట్స్ నిర్మాణాలకు కేటాయించారు.

ఈ స్థ లంలో 40 రిసార్ట్స్ నిర్మాణాలకు ప్రణాళిక సిద్ధం చేశారు.తొలి విడతగా మంజూరైన రూ.5 కోట్ల నిధులతో 12 రిసార్ట్స్, ఒక మెయిన్ బ్లాక్ పూర్తి చేశారు.2019 మార్చి నాటికి సుమారు రూ.రెండు కోట్లు వెచ్చించి మెయిన్ బ్లాక్ జీ ప్లస్ టూ) 70శాతం నిర్మాణాలు పూర్తి చేశారు.నాలుగు రి సార్ట్స్ నిర్మాణాలు 80శాతం పూర్తి చేశారు.

అనంతరం జరిగిన ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం, రిసార్ట్స్ నిర్మాణాలకు ని ధులు విడుదలకాకపోవడం వల్ల మూడేళ్లగా ని ర్మాణాలు నిలిచిపోయాయి.తాజాగా ఆరు నెలల కిందట పర్యాటక శాఖ ప్రత్యేక చొరవ తీసుకుని నిధులను సమీకరించుకుని అసంపూర్తి నిర్మాణా లను పూర్తి చేసింది.

Advertisement

ఇప్పటి వరకు మొత్తం రూ.మూడు కోట్ల నిధులు ఖర్చుచేసినట్టు పర్యా టకశాఖ అధికారులు చెబుతున్నారు.నిర్మాణం పూర్తయిన పర్యాటక శాఖ ని ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో అరకు ఎంపీ మాధవి పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి జిసిసి చైర్పర్సన్ స్వాతిరాణి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పర్యాటక శాఖ మంత్రి రోజా మాట్లాడుతూ పర్యాటక అభివృద్ధికి ప్రభుత్వం అనేక రకాలు చర్యలు తీసుకుంటుందని ఇందులో భాగంగా ప్రముఖ పర్యాటక కేంద్రం ఆంధ్ర కాశ్మీర్ గా పేరుగాంచిన లంబసింగిలో అసంపూర్తిగా ఉన్న రిసార్ట్స్ ని పూర్తి చేయించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చామని ఆమె అన్నారు.

Advertisement

తాజా వార్తలు