2012లో ఫ్రాన్స్ శాస్త్రవేత్తలు కనిపెట్టిన క్రిస్పర్ టెక్నాలజీని రియాల్టీ లోకి తీసుకోవచ్చే ప్రయత్నాలను చైనా చేస్తుంది.మనిషి డిఎన్ఏ ను మార్చడం వల్ల సూపర్ సోల్జర్ ను సృష్టించడాన్ని సాకారం చేసే దిశగా చైనా ప్రయత్నాలు చేస్తోంది.2012లో ఫ్రాన్స్ కి చెందిన ఇద్దరు మహిళా శాస్త్రవేత్తలు కనిపెట్టిన కొత్త టెక్నాలజీ పేరే క్రిస్పర్.ఈ టెక్నాలజీతో మానవుడి డీఎన్ఏ ను మార్చడం ద్వారా కోరుకున్న బిడ్డను సృష్టించవచ్చు అని వారు చెప్పారు.
2020 చైనా కూడా సేమ్ టు సేమ్ ఇదే టెక్నాలజీని ఉపయోగించి సూపర్ సోల్జర్ను సిద్ధం చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది.ఇది ఎవరో చెబుతున్న మాట కాదు అగ్ర దేశం అమెరికా ఈ విషయాన్ని ఆరోపించింది.
యుద్ధ రంగంలో దిగిన వీరు నిద్ర, ఆకలి లేకుండా ఎన్ని రోజులైనా విరామం విసుగు లేకుండా పోరాడే శక్తిని కలిగి ఉంటారని కూడా ఈ సందర్భంగా చెబుతోంది.అమెరికా ఇంటెలిజెన్స్ ప్రకారం రెండు సంవత్సరాల క్రితం 2020లోనే క్రిస్పార్ టెక్నాలజీ సాయంతో చైనా సూపర్ సైనికులను తయారు చేయడం మొదలుపెట్టిందని సమాచారం.

ఇందుకోసం చైనాలోని సైనికుల డిఎన్ఏ నమూనాలను తీసుకుంటున్నారు.డిఎన్ఏ ను మార్చడం ద్వారా ప్రమాదకరమైన సూపర్ సోల్జర్స్ తయారు చేయాలనే ప్లాన్లో చైనా ఉంది.అమెరికా చేసిన ఈ వాదనలను బ్రిటన్ కూడా సమర్థించడం విశేషం.ఇంకా చెప్పాలంటే 2018 నవంబర్ ప్రపంచంలోనే తొలి డిజైనర్ బేబీని తయారు చేసినట్లు చైనాకు చెందిన శాస్త్రవేత్త వెల్లడించాడు.
మానవ పిండంలో డిఎన్ఏ మార్పులు చేసిన తర్వాత అతడు ఈ విషయాన్ని బయట ప్రపంచానికి వెల్లడించాడు.సూపర్ సోల్జర్ ని సృష్టించడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని చైనా నమ్ముతుంది.
ఈ సైనికులకు ఎటువంటి అనారోగ్య సమస్యలు రావు.అంతేకాకుండా వీరికి ఎలాంటి భావోద్వేగాలు ఉండవు.
ఎలాంటి పరిస్థితుల్లో అయిన ఈ సైనికులు మరింత క్రూరంగా, కనికరం లేకుండా ప్రవర్తిస్తారు.వీరికి నిద్ర, ఆకలి కూడా ఉండదు.
ఈ సైనికులపై రసానిక యుద్ధం కూడా ఎటువంటి ప్రభావం చూపించదు.వీరికి గాయమైన యుద్ధభూమి నుంచి బయటికి రారు.







