భారత్ లో న్యూఇయర్ వేడుకలు ఘనంగా జరుపుకునే టాప్ ప్లేసెస్ ఏవో తెలుసా..!?

పాత సంవత్సరానికి వీడ్కోలు చెప్పి కొత్త సంవత్సరానికి స్వాగతం పలకడానికి ఇంకా కొద్ది రోజులు మాత్రమే మిగిలివుంది.

డిసెంబర్ 31 అర్ధరాత్రి 12 అయ్యేదాకా ఎదురుచూసి సరికొత్త ఉత్సహంతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు ప్రతి ఒక్కరు ఎదురుచూస్తారు.

డిసెంబర్ 31 నుంచే న్యూ ఇయర్ వేడుకలకు ప్రజలు సిద్దమయిపోతారు.ఆ రాత్రి బంధువులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు అందరు ఒక్కచోట చేరి సెలెబ్రేషన్స్ మొదలుపెడతారు.

మరి రాబోయే 2022 సంవత్సరానికి స్వాగతం చెబుతూ న్యూ ఇయర్ వేడుకలను సరికొత్తగా సెలబ్రేట్ చేసుకునేందుకు మన ఇండియాలో గల 11 బెస్ట్ ప్రదేశాల జాబితా వివరాలను తెలుసుకొండి.ఇండియాలో న్యూ ఇయర్ వేడుకల సెలబ్రేషన్స్ జరుపుకోవడానికి గోవా చాలా స్పెషల్ అనే చెప్పాలి.

న్యూ ఇయర్ సెలబ్రేషన్ల కోసం గోవా బీచ్‌లు ప్రతిఒక్కరికి స్వాగతం పలుకుతున్నాయి.అలాగే నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించుకునే ప్రదేశాలలో జమ్మూ కాశ్మీర్ లోని గుల్‌మార్గ్ పట్టణం ఒకటి.

Advertisement
Top Places In India For New Year Celebrations Details, New Year, Celebration, La

అందమైన ప్రకృతి ఒడిలో నూతన సంవత్సరాన్ని పలకరించాలనుకునే వారు ఈ నగరానికి వస్తే మరుపురాని అనుభూతిని పొందుతారు.ముఖ్యంగా మంచు, నిశ్శబ్దాన్ని ఇష్టపడే వారికి ఈ పట్టణం చాలా బాగుంటుంది.

అలా తమిళనాడులోని ఊటీ పట్టణం కూడా నూతన సంవత్సరాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఉత్తమమైంది అని చెప్పాలి.ప్రశాంతతతో పాటు ప్రకృతి అందాలను ఆస్వాదించాలంటే ఊటీ వెళ్ళాలిసిందే.

Top Places In India For New Year Celebrations Details, New Year, Celebration, La

ఊటీలో నూతన సంవత్సర ఈవెంట్‌లు, పార్టీలను నిర్వహించే అద్భుతమైన ప్రదేశాలు చాలా ఉన్నాయి.న్యూ ఇయర్ వేడుకలకి హిమాచల్ ప్రదేశ్ లోని మనాలి అయితే సూపర్ గా ఉంటుంది.ఇక్కడ గల వ్యాలీ ఆఫ్ ది గాడ్స్ ఏడాది పొడవునా పర్యాటకులతో ఈ ప్రాంతం కిక్కిరిసి ఉంటుంది.

ఈ పట్టణం మీ నూతన సంవత్సరాన్ని ప్రారంభించడానికి ఒక అందమైన ప్రదేశం.నూతన సంవత్సరం సందర్భంగా ప్రతి ఒక్కరు తప్పకుండా చూడదగ్గ ప్రదేశాలలో మనాలి ఒకటి.అలాగే మనాలిలో నూతన సంవత్సర వేడుకల్లో హిప్పీ సంస్కృతిని ఆస్వాదించవచ్చు.

Top Places In India For New Year Celebrations Details, New Year, Celebration, La
ప్రవస్తి ఆరోపణల గురించి రియాక్ట్ అయిన సింగర్ సునీత.. ఆమె ఏమన్నారంటే?
సుప్రీం కోర్టు పార్కింగ్‌లో లగ్జరీ కార్లు.. లాయర్ల రేంజ్ చూస్తే దిమ్మతిరగాల్సిందే!

అలాగే మరొక చక్కటి పర్యాటక ప్రాంతం కేరళలోని వయనాడ్ లేదా గ్రీన్ ప్యారడైజ్.ప్రశాంతమైన వాతావరణంలో నూతన సంవత్సరాన్ని ఆస్వాదించడానికి ఈ ప్రాంతం అద్భుతమైనది.పచ్చని సుగంధ తోటల చుట్టూ తిరుగుతూ సుందరమైన జలపాతాల సింఫొనీలను చూస్తూ ఎంతో ప్రశాంతంగా గడపవచ్చు.

Advertisement

మన దేశ రాజధాని దిల్లీలో నూతన సంవత్సరాన్ని జరుపుకోవడానికి అనేక ప్లేసెస్ ఉన్నాయి.ఖరీదైన పార్టీలతో, మీరు అద్భుతమైన లాంజ్‌లు, దిల్లీలోని ప్రత్యేకమైన నైట్‌క్లబ్‌లలో అత్యుత్తమ డీజేలు ప్లే చేసే పాటలను ఆస్వాదించవచ్చు.

హౌజ్ ఖాస్, కన్నాట్ ప్లేస్, గ్రేటర్ కైలాష్ లను సందర్శిస్తూ రాత్రి జీవితాన్ని ఆస్వాదించవచ్చు.ఉదయపూర్‌లోని సిటీ ఆఫ్ లేక్స్ నూతన సంవత్సరం వేడుకలు జరుపుకునేందుకు చక్కటి ప్రదేశం.

ఇక్కడ రాజభవనాలలో స్మారక చిహ్నాలను చూడవచ్చు.నూతన సంవత్సరాన్ని ఆస్వాదించడానికి ఇక్కడ అనేక రిసార్ట్‌లు, క్లబ్‌లు ఉన్నాయి.హిమాచల్ ప్రదేశ్ లోని మెక్లీడ్‌గంజ్ అద్భుతమైన సందర్శనా స్థలాల్లో ఒకటి.

మెక్లీడ్‌గంజ్‌లో అనేక దేవాలయాలు, మఠాలు ఉన్నాయి.మీరు ప్రశాంతమైన నూతన సంవత్సర వేడుకలను ఆస్వాదించాలనుకుంటే ఈ దేవాలయాలలో కొన్నింటిని సందర్శించండి.

భారత దేశంలో అత్యంత అందమైన నగరాల్లో కోల్‌కతా కూడా ఒకటి.నూతన సంవత్సరాన్ని జరుపుకోవడానికి ఇది ఉత్తమమైన ప్రదేశాలలో ఒకటి.

నగరంలోని నైట్‌క్లబ్‌ లు నూతన సంవత్సర వేడుకల సందర్భంగా అన్నీ సిద్ధంగా ఉన్నాయి.గ్రూవింగ్ సంగీతాన్ని ఆస్వాదిస్తూ.

రుచికరమైన వంటకాలను టేస్ట్ చేయవచ్చు.

ఇక దేశంలో ఐటీ హబ్‌ గా పేరుగాంచిన బెంగళూరులో ఈసారి రాబోయే నూతన సంవత్సరాన్ని ఆస్వాదించడానికి సిద్ధంగా ఉండండి.ఆహ్లాదకరమైన వాతావరణంలో పచ్చని ఉద్యానవనాలు, పబ్బులు, కేఫ్‌లు, వినోద కేంద్రాలు, విలాసవంతమైన బహిరంగ ప్రదేశాలతో న్యూ ఇయర్ నైట్ ఎంజాయ్ చేయవచ్చు.అలాగే నూతన సంవత్సర వేడుకలను ఈసారి పాండిచ్చేరిలో ప్లాన్ చేసుకుని చూడండి.

ఇక్కడ నూతన సంవత్సర వేడుకలను మీరు మునుపెన్నడూ చూసి ఉండరు.అందమైన రిసార్ట్‌లు, పబ్బులు, బీచ్‌లు, క్లబ్‌ లు మీకు స్వాగతం చెబుతాయి.

పాండిచ్చేరి నైట్ లైఫ్ పార్టీలు యువతను ఉర్రూతలూగిస్తాయి.పాండిచ్చేరిలో నూతన సంవత్సరాన్ని జరుపుకోవడానికి పోర్ట్ బీచ్ పార్టీ, బీచ్ బాష్ NYE , కాటమరాన్ బీచ్ ఫెస్టివల్ సిద్ధంగా ఉన్నాయి.

చూసారు కదా మన ఇండియాలో న్యూ ఇయర్ వేడుకలు ఎక్కడెక్కడ గ్రాండ్ గా చేస్తారో.మరి మీరు కూడా ఎక్కడో ఒకచోట మీ న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ ను ప్లాన్ చేసుకుని ఎంజాయ్ చేయండి మరి.

తాజా వార్తలు