చిరంజీవి ని నమ్మించి మోసం చేసిన స్టార్ డైరెక్టర్లు...

ప్రస్తుతం ఇండస్ట్రీ లో చిరంజీవి( Chiranjeevi ) అంటే ఒక శిఖరం అనే చెప్పాలి తెలుగు సినిమా ఇండస్ట్రీ ఈ స్థాయిలో ఉండటానికి చిరంజీవి తన సినిమా ల రూపం లో ఇండస్ట్రీ కి చాలా సేవ చేసాడు.

కానీ చిరంజీవి ఈ స్థాయికి ఎదగడం లో చాలా కష్టం ఉంది.

చిరంజీవి ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఏ పాత్ర పడితే ఆ పాత్ర చేసి అవకాశం కోసం ఎన్నో రకాల తిప్పలు పడ్డారు.అలాంటి చిరంజీవి కి మొదట్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా కొన్ని అవకాశాలు వచ్చాయి.

వాటిని వినియోగించుకొని ఎలాగైనా ఆర్టిస్టుగా నిలదిక్కుకోవాలని ప్రయత్నాలు చేశారు.ఇక ఆ టైంలోనే చిరంజీవిలో ఉన్న హీరోయిజాన్ని చూసి కొంతమంది దర్శక నిర్మాతలు ఆయనకు హీరోగా కూడా అవకాశాలు ఇచ్చారు.

అయితే హీరోగా అవకాశాలు ఇస్తున్న టైంలో కొంతమంది డైరెక్టర్లు( Directors ) చిరంజీవితో సీనియర్ ఎన్టీఆర్,కృష్ణ వంటి స్టార్ హీరోల సినిమాల్లో విలన్ గా, గెస్ట్ రోల్స్ లో తీసుకున్నారు.దాంతో ఆయనతో సినిమా తీసే డైరెక్టర్లు నువ్వు ఇలా మిగతా హీరోల సినిమాల్లో గెస్ట్ రోల్స్ విలన్ క్యారెక్టర్లు చేస్తే మా సినిమా ఎలా హిట్ అవుతుంది బాబు.

Advertisement

నువ్వు ఇలాంటి పనులు చేస్తే మా సినిమా ప్లాఫ్ అవడం ఖాయం అంటూ డైరెక్టర్లు చెప్పే వారట.

కానీ సీనియర్ ఎన్టీఆర్,( Sr NTR ) కృష్ణ( Krishna ) వంటి స్టార్ హీరోలతో సినిమాలు తెరకెక్కించే డైరెక్టర్లు మాత్రం నువ్వు ఈ సినిమాలోని క్యారెక్టర్ లో నటిస్తే కచ్చితంగా మా నెక్స్ట్ సినిమాకి హీరో నువ్వే అంటూ ఆయనకు చెప్పేవారట.దాంతో చిరంజీవి చేసేదేమీ లేక అలాంటి పెద్ద డైరెక్టర్ల దర్శకత్వంలో సినిమాలు చేస్తే నా రేంజ్ మారిపోతుంది అనే ఉద్దేశంతో అలాగే నెక్స్ట్ సినిమాలో ఆయనకు హీరోగా అవకాశం ఇస్తారు అనే ఆశతో సీనియర్ ఎన్టీఆర్, కృష్ణ వంటి స్టార్ హీరోల సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించేవారట.

ఇటు తనతో సినిమాలు తీసే దర్శకులకు ఏదో ఒకటి నచ్చజెప్పుతూ అలాగే పెద్ద డైరెక్టర్లు చేసే సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా,విలన్ గా చేస్తూ అటు వారిని కూడా లైన్లో పెట్టేవారట.కానీ చివరికి ఆ పెద్ద దర్శకులు మాత్రం చిరంజీవి కి అవకాశాలు ఇవ్వకుండా వాడుకొని మోసం చేసేవారట.ఇక ఈ విషయాన్ని చిరంజీవి చాలా రోజులు భరించారు.

కానీ ఎప్పుడైతే చిరంజీవి స్టార్ హీరోగా( Star Hero ) మారిపోయారో అప్పటినుండి చాలామంది దర్శకులు ఈయనతో సినిమాలు తీయడానికి ఆసక్తి చూపించేవారు.అలా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఎంతోమంది చేతిలో చిరంజీవి మోసపోయారట.

దృఢమైన, తెల్లటి దంతాలు కోసం ఈ చిట్కాలను తప్పక పాటించండి!
పవన్ కళ్యాణ్ రాజకీయాలలో చరిత్ర సృష్టించారు.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన పరుచూరి!

అయినప్పటికీ ఆ తర్వాత కాలం లో చిరంజీవి మెగాస్టార్ అయ్యాడు.ఇండస్ట్రీ మొత్తాన్ని రూల్ చేసే హీరో గా ఎదిగాడు.

Advertisement

తాజా వార్తలు