ఏపీలో రీపోలింగ్! మూడంచెల భద్రత ఏర్పాట్లు

ఏపీలో రీ పోలింగ్ కి రంగం సిద్ధం అయ్యింది.గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో మొత్తం ఐదు కేంద్రాలలో రీపోలింగ్ సోమవారం జరగనుంది.

ఇక ఈ పోలింగ్ పై ఎన్నికల కమిషన్ ప్రత్యేక ద్రుష్టి పెట్టింది.రీపోలింగ్ కి ఇప్పటికే రంగం సిద్ధం చేసిన ఎన్నికల సంఘం ఎన్నికలు జరిగే కేంద్రాలలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా చేసింది.

ఇదిలా ఉంటే రీ పోలింగ్ పై ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణద ద్వివేది ఆసక్తికర వాఖ్యలు చేసారు.ఎన్నికల సిబ్బంది రీ పోలింగ్‌లో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా కఠినంగా వ్యవహరిస్తామని గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు.

రీ పోలింగ్‌ జరగనున్న పోలింగ్‌ బూత్‌ల వద్ద మూడంచెల పోలీస్‌ భద్రత ఏర్పాటు చేశామని, ఓటర్లు నిర్భయంగా, స్వేచ్ఛగా ఓటుహక్కుని వినియోగించుకోవాలని.సీసీ కెమెరాల ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తామని చెప్పారు.ఉదయం 5.30 గంటలకే మాక్ పోలింగ్ నిర్వహించేలా స్పష్టమైన ఆదేశాలను జారీ చేసామని చెప్పారు.రాజకీయ పార్టీల పోలింగ్ కేంద్రం ఏజెంట్లు నిర్ణీత సమయానికి పోలింగ్ కేంద్రాలకు చేరుకుని సహకారాన్ని అందించాలని కోరారు.

Advertisement
గన్నవరంలో వర్షంలో చంద్రబాబు ప్రసంగం..!!

తాజా వార్తలు