కొద్ది రోజుల క్రితం విశాఖలో రేవ్ పార్టీ ఉదంతం మరిచిపోక ముందే తాజాగా మరో సంఘటన ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది.దేశ రాజధానికి సమీపంలో నోయిడాలో ఓ ఫామ్‌హౌస్‌లో అక్రమంగా రేవ్ పార్టీ నిర్వహిస్తున్న దాదాపు 200 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వీరిలో 161 మంది అబ్బాయిలు కాగా, 31 మంది అమ్మాయిలు ఉన్నారు.సెక్టార్ 135లో శనివారం రాత్రి వీరంతా పార్టీ చేసుకున్నారని, మద్యం, మత్తుపదార్థాలతో, అశ్లీల నృత్యాలతో వారు చేసిన హడావిడి పోలీసులకి కూడా షాక్ కి గురి చేసిందని అని సమాచారం.
ఫామ్‌హౌస్‌లో రేవ్‌పార్టీ జరుగుతున్నట్టు సమాచారం రావడంతో దాడి చేసినట్టు, 161 మంది అబ్బాయిలు, 31 మంది అమ్మాయిులను అదుపులోకి తీసుకున్నట్టు సీనియర్ సూపరింటెండెంట్ వైభవ్ కృష్ణ తెలిపారు.అరెస్ట్ అయిన వారిలో చాలామంది ఢిల్లీకి చెందని వారని, మిగతా వారిలో కొందరు హరియాణాకు చెందిన వారు ఉన్నారని, నోయిడాకు చెందిన వారు కొద్దిమందేనని వివరించారు.
వారి నుంచి 31 హుక్కా, 112 బీరు బాటిళ్లు, 30 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.అందరూ ఉన్నత వర్గాలకి చెందిన వారేనని పోలీసులు తెలియజేసారు.
అయితే వీటిపై కఠినంగా వ్యవహరిస్తామని పోలీస్ ఉన్నతాధికారులు తెలియజేసారు.







