తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి( Telangana CM Revanth Reddy ) ప్రమాణ స్వీకారం చేశాక కొద్ది మంది సినీ ప్రముఖులు మాత్రమే ఆయనను కలవడం జరిగింది.గత ఏడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది.
అనంతరం డిసెంబర్ 7వ తారీకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు.ఈ ప్రమాణ స్వీకారం అనంతరం టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన చిరంజీవి, అల్లు అరవింద్, నమ్రత వంటి వాళ్ళు మర్యాదపూర్వకంగా కలవటం జరిగింది.
ఇదిలా ఉంటే ఆదివారం జనవరి 28వ తారీకు సీఎం రేవంత్ రెడ్డిని ప్రముఖ టాలీవుడ్ నిర్మాతలు( Tollywood Producers ) మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఇండస్ట్రీకి సంబంధించిన పలు అంశాలపై చర్చించడం జరిగింది.సీఎం నివాసంలో జరిగిన ఈ భేటీలో తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ దిల్ రాజు, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అధ్యక్షుడు కేఎల్ దామోదర ప్రసాద్, కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్నకుమార్, తెలంగాణ స్టేట్ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు సునీల్ నారంగ్, ప్రొడ్యూసర్స్ గిల్డ్ ప్రెసిడెంట్ పీవీ రవి కిషోర్, ట్రెజరర్ బాపినీడు, సుప్రియ తదితరులు ఉన్నారు.ఈ సందర్భంగా సానుకూలంగా స్పందించి తెలుగు చిత్ర పరిశ్రమకు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.