టాలీవుడ్లో కొత్త ట్రెండ్.. ఇక్కడి వాళ్లు అక్కడ అక్కడి వాళ్ళు ఇక్కడ?

సాధారణంగా చిత్ర పరిశ్రమలో ఎప్పుడు ట్రెండ్ మారుతూ ఉంటుంది అనే విషయం తెలిసిందే.

ఇలా ట్రెండ్ మారిన సమయంలో దర్శకులు హీరోలు నిర్మాతలు అందరూ కూడా ఇదే ట్రెండ్ ఫాలో అవుతూ ఉంటారు.

ఇప్పుడు కూడా టాలీవుడ్లో కొత్త ట్రెండ్ మారిపోయింది అని తెలుస్తోంది.ఇక్కడి వారు అక్కడ అక్కడి వారు ఇక్కడ సినిమాలు చేసేస్తున్నారు.

అర్థం కాలేదండీ కాస్త డీటెయిల్ గా చెబుతారా అంటారా.అయ్యో మీరు అడిగితే డీటెయిల్ గా చెప్పకుండా ఎందుకు ఉంటాను తప్పకుండా చెప్తాను.

ఒకసారి వివరాల్లోకి వెళితే.ఇటీవల కాలంలో టాలీవుడ్ మార్కెట్ ఎంతలా పెరిగిపోయిన ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Advertisement

స్టార్ హీరో సినిమా వస్తుందంటే చాలు నార్త్ లో సైతం ఈ సినిమాకు సంబంధించి ఎంక్వైరీలు మొదలవుతున్నాయి.దీంతో కోలీవుడ్ దర్శక నిర్మాతలు అందరి కన్ను కూడా టాలీవుడ్ మీదే పడిపోయింది అన్నది తెలుస్తుంది.

ప్రస్తుతం రామ్ హీరోగా తమిళ దర్శకుడు లింగుస్వామి తెరకెక్కిస్తున్న ది వారియర్.ఇక ఈ సినిమాని తెలుగుతో పాటు తమిళంలో కూడా తెరకెక్కిస్తున్నారు.

లింగస్వామి కి తొలి తెలుగు చిత్రం కాగా రామ్ కు తొలి తమిళ చిత్రం కూడా ఇదే.మెగాస్టార్ గాడ్ ఫాదర్ చిత్రాన్ని తమిళ దర్శకుడు మోహన్ రాజు తెరకెక్కిస్తున్నారు.లూసిఫర్ తెలుగు రీమేక్గా తెరకెక్కుతోంది.

ఇక్కడి దర్శకులు అక్కడి వారితో సినిమాలు తీస్తున్నారు.హను రాఘవపూడి దర్శకత్వంలో యుద్ధం తో రాసిన ప్రేమ కథ అంటూ దుల్కర్ సల్మాన్ రష్మిక మందన తో ఒక సినిమా చేస్తున్నాడు సినిమా.అశ్వినీదత్ నిర్మాణంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది.

నిత్యం ఈ పొడిని తీసుకుంటే కళ్ళ‌జోడుకు మీరు శాశ్వతంగా గుడ్ బై చెప్పొచ్చు!
కూతురి పెళ్లి వీడియో షేర్ చేసిన అర్జున్ సర్జా... మాటలు రావడం లేదంటూ పోస్ట్?

నాగచైతన్య హీరోగా తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు డైరెక్షన్లో మూవీ రూపొందుతూ ఉంది.తమిళ తెలుగు భాషల్లో ఒకేసారి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement

ఇక ఈ సినిమాతో వెంకట్ప్రభు తెలుగు ప్రేక్షకులకు నాగచైతన్య తమిళ ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నాడు.ఇక వైష్ణవి తేజ్ తమిళ డైరెక్టర్ తో రంగ రంగ వైభవంగా చేస్తున్నాడు.హీరో ధనుష్ తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరితో సినిమా చేస్తున్నాడు.

వంశీ పైడిపల్లి విజయ్ తో సినిమాకు రెడీ అవుతున్నాడు.అక్కడి దర్శకుల తెలుగు హీరోలతో తెలుగు దర్శకులు అక్కడి హీరోలతో సినిమాలు చేస్తూ ట్రెండ్ ఫాలో అవుతున్నారు.

తాజా వార్తలు