బెజవాడ రాములు కట్టిన జరదా కిళ్ళి మాత్రమే ఎన్టీఆర్ ఎందుకు వేసుకునేవారు ?

ఎన్టీఆర్ గురించి ఇప్పటికి చాలా విషయాలు మనం చూస్తూనే ఉన్నాం.అయినా కూడా ఆయన గురించి తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి.

వాటిల్లో కొన్నింటిని ఈరోజు తెలుసుకుందాం.చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించిన తొలి రోజుల్లో ఫోటోలు దిగడం అంటే ఎన్టీఆర్ కి చాలా ఇష్టంగా ఉండేది.

ఎవరైనా కెమెరాతో వచ్చి ఫోటోలు తీసుకుంటాం అని అడిగితే తీసుకో బ్రదర్ నీకు ఎన్ని కావాలంటే అన్ని అని అనేవారట.స్టార్ హీరోగా ఎదిగాక కూడా ఆ అలవాటుని కొనసాగించారు ఎన్టీఆర్.

ఇక కెరియర్ బిగినింగ్ లో తన నటనకు మరింత సాన పట్టడానికి హిందీ సినిమాలు ఎక్కువగా చూసేవారు రామారావు.ఖాళీగా ఉన్నప్పుడు టేబుల్ మీద దరువు వేస్తూ హిందీ పాటలు పాడటం అంటే ఆయనకు చాలా ఇష్టం.

Advertisement

ఎన్టీఆర్ గుంటూరు కాలేజీలో చదువుకునే రోజుల్లో తెనాలి పౌరాణిక నాటకాలకు బాగా ప్రసిద్ధి.సాయంత్రం 7:00 కల్లా భోజనం చేసి తన మిత్ర బృందంతో సైకిల్ మీద తినాలి వెళ్లి అక్కడ పౌరాణిక నాటకం చూసి తెల్లారి గుంటూరు కి తిరిగి వచ్చేవారు.సైకిల్ తొక్కడం అంటే ఆయనకు మహా సరదా.

సినిమాల్లోకి రాకముందు ఘాటైన జరదా కిళ్ళి వేసే అలవాటు ఎన్టీఆర్ కి ఉండేది.బెజవాడ రాములు కట్టిన జరదా కిళ్ళి ఆయన వేసుకునేవారు.

మన దేశం షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ అలవాటును గమనించిన ఎల్వి ప్రసాద్ కిళ్లీ వేసుకోవడం వల్ల పళ్ళు ఎర్రగా మారుతాయి.ఆర్టిస్ట్ కి ఆరోగ్యం, అందం కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది అని చెప్పడంతో ఆ అలవాటుని మానేశారు ఎన్టీఆర్.

ఇక ఎన్టీఆర్ చిన్నతనం నుంచి కష్టజీవి.15 ఏళ్ల వయసు నుంచి వ్యాయామం, యోగాసనాలు వేసేవారు.ఆ తర్వాత పాలు పితికి బిందెలు సైకిల్ కి కట్టుకొని హోటళ్లకు సరఫరా చేసి కాలేజీకి వెళ్లేవారు.

హెచ్‎సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్..!
హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

చిత్ర పరిశ్రమలో దర్శకులను కలుసుకోవడం, నిర్మాతలను కలవడం, సెట్లో సీనియర్ ఆర్టిస్టులు నటిస్తున్నప్పుడు గమనించడం వంటివి చేసేవారు.వారి డైలాగులను బీచ్ కి వెళ్లి ప్రాక్టీస్ చేసి నేర్చుకునే వారు.

Advertisement

ఖాళీగా ఉండడం ఎన్టీఆర్ కు నచ్చదు.నిరంతర కృషి, శ్రమ ఆయన నమ్మిన సూత్రాలు.సినిమా అంటే సమిష్టి విజయం అని గట్టిగా నమ్మే వ్యక్తుల్లో ఎన్టీఆర్ ముందుంటారు.

అందుకే ఎవరైనా నిర్మాత తనను సినిమా తీయమని అడిగితే మీ టెక్నీషియన్స్ ఎవరు అని అడిగిన తర్వాతే కథ వినేవారట.ఎన్టీఆర్ కి అద్భుతమైన జ్ఞాపకశక్తి ఉంది ఒకటి నాలుగు సార్లు చదివితే చాలు ఎంత పెద్ద డైలాగ్ అయినా కంఠతా వచ్చేది.

ఇక మనదేశంలో ఎన్టీఆర్ కి 2000 రూపాయల పారితోషకం ఇచ్చారు.ఆ తర్వాత అగ్ర హీరోగా 22 ఏళ్ల పాటు వేళాల్లోనే పారితోషకం తీసుకున్నారు.శోభన్ బాబు ఎంట్రీ తర్వాతే ఆయన మొదటిసారి లక్ష రూపాయలు తీసుకున్నారు.

ఇక మేజర్ చంద్రకాంత్ సినిమాకి తొలిసారి కోటి రూపాయలు తీసుకున్నారు.

తాజా వార్తలు