టాలీవుడ్ మొత్తం ఆ నలుగురు హీరోయిన్స్ చుట్టూనే తిరుగుతుంది

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎప్పుడూ కూడా హీరోయిన్స్ విషయంలో ఒక ట్రెండ్ నడుస్తూ ఉంటుంది.ఓ పదేళ్ళ పాటు కొంత మంది హీరోయిన్స్ హవా నడుస్తుంది.

ప్రతి దశాబ్దానికి ఈ హీరోయిన్స్ కాంబినేషన్ మారుతూ వస్తుంది.2020 ముందు వరకు టాలీవుడ్ లో కాజల్ అగర్వాల్, సమంత, తమన్నా, అనుష్క లాంటి అందాల భామలు హవా కొనసాగింది.తరువాత రకుల్ ప్రీత్ సింగ్ జెట్ స్పీడ్ తో దూసుకొచ్చి స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకుంది.

ఇప్పుడు రకుల్ కూడా ఈ కమర్షియల్ సినిమా ప్రపంచంలో రేస్ లో వెనక్కి వెళ్ళిపోయింది.ఇప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ రేస్ లో నలుగురు అందాల భామలు ఉన్నారు.

వారి మధ్య ఇప్పుడు సినిమాల విషయంలో ఆసక్తికరమైన పోటీ నెలకొని ఉంది.సినిమా సినిమాకి ఈ భామలు తమ రేంజ్ పెంచుకుంటూ స్టార్ హీరోయిన్స్ రేస్ లో ఒకరికి మించి ఒకరు అన్నట్లు పోటీ పడుతున్నారు.

అయితే ఈ సారి గ్లామర్ కంటే టాలెంట్ ఎక్కువగా స్టార్ చైర్ ని శాసిస్తుంది.ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్స్ గా ఉన్న అందాల భామలలో పూజా హెగ్డే, రష్మిక మందన, కీర్తి సురేష్, సాయి పల్లవి మంచి జోరు మీద ఉన్నారు.

Advertisement

వీరిలో పూజా హెగ్డే గ్లామర్ తో టాప్ చైర్ లోకి వచ్చే ప్రయత్నం చేస్తుంది.ఆమె అందం కమర్షియల్ హీరోయిన్ గా అవకాశాలు తెచ్చిపెడుతుంది.స్టార్ హీరోలు అందరూ పూజాహెగ్డేని ఫస్ట్ ఛాయస్ గా చూస్తున్నారు.

తరువాత రేసులో రష్మిక మందన ఉంది.ఈ భామ అటు అందం, ఇటు అభినయంతో ఇప్పటికే ప్రేక్షకులని తన వైపుకి తిప్పుకుంది.

ఎక్కువగా అందాల ఆరబోత లేకుండా అవసరమైతే లిప్ లాక్ సన్నివేశాలు చేయడానికి రష్మిక అభ్యంతరం చెప్పకపోవడంతో ఈమెకి కమర్షియల్ హీరోయిన్ గా భాగానే అవకాశాలు వస్తున్నాయి.ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో పుష్ప సినిమా, ఆచార్య మూవీ ఉన్నాయి.

ఇదే దారిలో తన అభినయంతో తెలుగు ప్రేక్షకుల హృదయాలని కొల్లగొట్టిన కీర్తి సురేష్ ఈ రేసులో చాలా జోరు మీద ఉంది.ప్రస్తుతం మహేష్ బాబు సినిమాలో ఈ అమ్మడు హీరోయిన్ గా చేస్తుంది.

అమ్మతోడు ఆస్తి కోసం కాదు.. మంచు మనోజ్ సంచలన వ్యాఖ్యలు నెట్టింట వైరల్!
బైక్‌పై వెళ్తున్నాడా.. లేక నిద్రపోతున్నాడా? కుక్క మాత్రం ఏం చేసిందో చూడండి!

దీంతో పాటు కీర్తి చేతిలో ఎనిమిది సినిమాల వరకు ఉన్నాయి.కేవలం ఈ భామ ఒక్క తెలుగుకే పరిమితం కాకుండా మూడు భాషలలో తన ఆధిపత్యం చూపిస్తుంది.

Advertisement

వీరి తర్వాత సాయి పల్లవి కూడా రేసులో ఉంది.అందం, అభినయంతో పాటు డ్యాన్సింగ్ టాలెంట్ ఈ భామకి అదనపు ఆకర్షణ.

ఇప్పటికే తన డాన్స్ లతో సోషల్ మీడియాలో ప్రేక్షకుల హృదయాలని కొల్లగొట్టింది.స్టార్ హీరోలు ఈ భామతో చేయడానికి కాస్తా సంకోచిస్తున్న, ఆమె కూడా ప్రాధాన్యత ఉన్న పత్రాలని మాత్రమే ఎంపిక చేసుకుంటూ సినిమాలు చేస్తుంది.

ఇలా ఈ జెనరేషన్ కి ఈ నలుగురు అందాల భామలు ఆరాధ్యదేవతలుగా మారే అవకాశం కనిపిస్తుంది.

తాజా వార్తలు