తెలుగింటి రచయిత్రి సరోజినీ నాయుడు బయోపిక్

భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ఎంతో మంది కీలక భూమిక పోషించారు.అయితే వారిలో అతికొద్ది మాత్రం ఎప్పటికి గుర్తుండిపోతారు.

స్వాతంత్ర్య ఉద్యమ పోరాటంలో భాగమైన వారు తెలుగు నెలకి చెందిన మహిళామణులు కూడా ఉన్నారు.గాంధీజీని మెప్పించిన వ్యక్తులు ఉన్నారు.

వారిలో ముందు వరుసలో కనిపించే వ్యక్తి సరోజినీనాయుడు.తెలుగింటి కోడలైన ఈమె అప్పటి స్వాతంత్య్రఉద్యమంలో భాగం కావడంతో పాటు స్త్రీల హక్కుల పై పోరాడిన మహిళ, కవయిత్రి, భారతదేశ తొలి మహిళా గవర్నర్, నైటింగేల్‌ ఆఫ్‌ ఇండియాగా గుర్తింపు పొందింది.

ఇలాంటి మహోన్నత వ్యక్తిత్వం ఉన్న సరోజినీ నాయుడు బయోపిక్ ఇప్పుడు తెరపైకి రాబోతుంది.సరోజినీ నాయుడు పాత్రను దూరదర్శన్ లో రామాయణ్‌ టీవీ సీరియల్‌లో సీతగా నటించి, అప్పటి తరానికి అభిమాన తారగా మారిపోయిన దీపికా చిఖలియా పోషించనున్నారు.

Advertisement

సీతగా అందరికి గుర్తుండిపోయిన ఆమె పలు బాలీవుడ్ సినిమాలలో నటించింది.తెలుగులో కూడా బ్రహ్మర్షి విశ్వామిత్ర చిత్రంలో చంద్రమతిగా నటించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సరోజినీ నాయుడు బయోపిక్‌లో నటించే అవకాశం నాకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది.ఆన్‌లైన్‌లో సరోజినీగారి గురించి వెతికాను.

లాక్‌డౌన్‌ పూర్తయిన తర్వాత పూర్తి స్క్రిప్ట్‌ విని నిర్ణయం తీసుకుంటాను అని పేర్కొన్నారు.ధీరజ్‌ మిశ్రాయే ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారని బాలీవుడ్‌ టాక్‌.

ఇక ఈ సినిమా కంటెంట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి సంబంధం ఉండటంతో, ఇక్కడ కూడా ఆమెకి గుర్తింపు ఉండటంతో తెలుగులో కూడా రిలీజ్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది.

భర్తతో దిగిన ఫోటోలను డిలీట్ చేయాలని కోరిన కత్రినా కైఫ్.. అసలేం జరిగిందంటే?
Advertisement

తాజా వార్తలు