టాలీవుడ్ టాప్ డైరెక్టర్లు ఒక్కో సినిమాకు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటారో తెలుసా?

ప్రస్తుతం తెలుగు సినిమాల స్థాయి పెరిగింది.పాన్ ఇండియా సినిమాల్లో చాలా సినిమాలు టాలీవుడ్ నుంచే తెరకెక్కుతున్నాయి.

అన్ని భాషల్లో ఆయా సినిమాలు మంచి విజయాన్ని అందుకుంటున్నాయి.కలెక్షన్లు కూడా భారీగానే వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో హీరోల రెమ్యునరేషన్ తో పాటు దర్శకుల రెమ్యునరేషన్ కూడా భారీగా పెరిగింది.ఇంతకీ టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్లుగా కొనసాగుతున్న వారికి రెమ్యునరేష్ ఎంత ఉండొచ్చు? అనే చర్చ నడుస్తోంది.రాజమౌళి, త్రివిక్రమ్‌, బోయపాటి లాంటి దర్శకులు ఒక్కో సినిమాకు ఎంత తీసుకుంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

*రాజమౌళి

తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు రాజమౌళి. ఆయన సినిమా చేశాడంటే రికార్డుల మోత మోగాల్సిందే.

Advertisement

అటు తన సినిమాలకు రెమ్యునరేషన్ కూడా ఆయన భారీగానే తీసుకుంటాడు.ఒక్కో సినిమాకు రూ.30 కోట్లు అందుకోవడంతో పాటు సినిమా లాభాల్లో వాటా కూడా తీసుకుంటాడు.సినిమా స్థాయిని బట్టి తన పారితోషకం ఫిక్స్ చేస్తాడు.

*సుకుమార్‌

రంగ స్థలం సినిమా తర్వాత సుకుమార్ తన రేటు పెంచాడు.ఒక్కో సినిమాను ఆయన ప్రస్తుతం రూ.20 కోట్లు తీసుకుంటున్నాడు.అటు లాభాల్లో వాటా కూడా అందుకుంటున్నాడు.

ప్రస్తుతం ఆయన అల్లు అర్జున్ తో కలిసి పుష్ప 2 సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా కోసం తను రూ.23 కోట్లు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

*త్రివిక్రమ్

ఈ టాప్ డైరెక్టర్ కూడా రెమ్యునరేషన్ విషయంలో అస్సలు తగ్గడం లేదు.ఈయన ఒక్కో సినిమాకు రూ.20 కోట్లు తీసుకుంటున్నాడు.లాభాల్లో వాటా కూడా తీసుకుంటున్నారు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

అల వైకుంఠపురంలో సినిమా తర్వాత ఈయన రెమ్యునరేషన్ భారీగా పెరిగింది.

*కొరటాల

ఈయన కూడా ఒక్కో సినిమాకు రూ.20 కోట్లు తీసుకుంటున్నాడు.ప్రస్తుతం ఆయన చిరంజీవితో కలిసి ఆచార్య సినిమా చేస్తున్నాడు.

Advertisement

గడిచిన రెండు సంవత్సరాలుగా ఆయన ఇదే సినిమా చేస్తున్నాడు.అందుకే ఆచార్యకు తన రెమ్యునరేషన్ పెంచినట్ల తెలుస్తోంది.

*బోయపాటి

సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా ఒక్కో సినిమాకు రూ.10 కోట్లకు పైనేతీసుకుంటున్నాడు బోయపాటి.ఆయన బాలయ్యతో కలిసి వరుస హిట్లు చేస్తున్నాడు.

*పూరి

మాస్ దర్శకుడు పూరి కూడా బాగానే డబ్బులు తీసుకుంటున్నాడు.ఒక్కో సినిమాకు రూ.7 నుంచి 10 కోట్ల వరకు అందుకుంటున్నాడు.ఆయన ప్రస్తుతం సొంత నిర్మాణ సంస్థలో సినిమాలు చేస్తున్నాడు.అటు అనిల్ రావిపూడి, పరుశురామ్‌, నాగ్‌ అశ్విన్‌ ఒక్కో సినిమాకు రూ.8 కోట్లు తీసుకుంటున్నారు.శేఖర్‌ కమ్ముల రూ.5 కోట్లు, క్రిష్‌ రూ.4 కోట్ల వరకు పారితోషకం అందుకుంటున్నట్లు తెలుస్తోంది.

తాజా వార్తలు