రామ్ గోపాల్ వర్మని తాత అంటున్న జక్కన్న....

ఎప్పుడు విభిన్న కథనాలు ఎంచుకుంటూ ప్రేక్షకుల్లో తనకంటూ ఒక ఇజాన్ని క్రియేట్ చేసినటువంటి దర్శకుడు రాంగోపాల్ వర్మ.

అయితే తాజాగా రామ్ గోపాల్ వర్మ కూతురు రేవతి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.

ఈ వార్తను రాంగోపాల్ వర్మ తన అధికారిక ట్విట్టర్ ద్వారా తన అభిమానులతో పంచుకున్నాడు.దీంతో పలువురు సినీ ప్రముఖులు మరియు అభిమానులు రామ్ గోపాల్ వర్మకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

అయితే ఇందులో భాగంగా ప్రముఖ దర్శకుడు జక్కన్న ఎస్.ఎస్.రాజమౌళి శుభాకాంక్షలు తెలియజేస్తూ రాంగోపాల్ వర్మ ఉద్దేశిస్తూ ఓ ట్వీట్ చేశాడు.ప్రస్తుతం ఈ ట్వీట్ బాగానే వైరల్ అవుతోంది.

ఈ ట్వీట్ లో రాజమౌళి శుభాకాంక్షలు రాము తాతయ్య గారు అంటూ ఇక మీకు కళ్లెం వేసేందుకు మీ మనవరాలు వచ్చేసిందని అన్నారు.అంతేగాక ఇప్పుడు మిమ్మల్ని ఏమని పిలవాలి రాము తాత.! లేదా రాము నాన్న లేదా గ్రాండ్ పా రాము అంటూ ఫన్నీగా ట్వీట్ చేశారు.  అయితే ఈ ట్వీట్ పై రామ్ గోపాల్ వర్మ ఎలా స్పందిస్తాడో చూడాలి.

Advertisement

అయితే ఇదిలా ఉండగా ప్రస్తుతం రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ చిత్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్నారు.

ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 8వ తారీఖు న విడుదల చేసేందుకు దర్శకుడు జక్కన్న సన్నాహాలు చేస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు