తెలుగు సినీ ప్రేక్షకులకు ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.మొదట కెరటం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.
మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకోవడం తో పాటు వరుసగా అవకాశాలను అందుకుంటూ అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది రకుల్.టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ సినిమాలలో నటించి మెప్పించింది.
కాగా తెలుగులో నాన్నకు ప్రేమతో, ధ్రువ, లౌక్యం, వెంకటాద్రి ఎక్స్ప్రెస్, కరెంటు తీగ, సరైనోడు, బ్రూస్ లీ, పండగ చేసుకో, రారండోయ్ వేడుక చూద్దాం, జయ జానకి నాయక లాంటి సినిమాలలో నటించి మెప్పించిన విషయం మనందరికీ తెలిసిందే.
అయితే ఈ మధ్యకాలంలో రకుల్ ప్రీత్ సింగ్ కు అంతగా సినిమాలలో అవకాశాలు రావడం లేదు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం తెలుగులో ఏ సినిమాలలో నటించడం లేదు అన్న విషయం అందరికీ తెలిసిందే.బాలీవుడ్ లో పలువురు స్టార్ హీరోల సరసన నటించినప్పటికీ ఆ సినిమాలు కూడా అందగా సక్సెస్ కాలేకపోయాయి.
ఇది ఇలా ఉంటే మొన్నటి వరకు ఫుల్ ఫామ్ లో ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ ఒక్కొక్క సినిమాకు కోటి 50 లక్షలు తీసుకుంది.అయితే ప్రస్తుతం అవకాశాలు లేకపోవడంతో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని అందిపుచ్చుకుంటూ రోజుకు 3 లక్షలు పారితోషికంగా గా తీసుకుంటుంది అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.
కాగా రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం చత్రివాలి అనే ఒక బోల్డ్ హిందీ సినిమాలో నటించింది.

ఆ సినిమాలో కూడా ఒక అభ్యంతరమైన పాత్రలో నటించింది రకుల్ ప్రీత్ సింగ్.కాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను ఇటీవలే విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందనను అందుకుంది.ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ కండోమ్ క్వాలిటీ చెక్ చేసే పాత్రలో నటిస్తోంది.
బాలీవుడ్ ప్రముఖ నిర్మాత రోని స్క్రూవాలా నిర్మించిన ఈ సినిమా జీ5 లో స్ట్రీమింగ్ కానుంది.జనవరి 20,2023 న జి ఫైవ్ లో స్ట్రీమింగ్ కానుంది.
అయితే రకుల్ ప్రీత్ సింగ్ కి సరైన అవకాశాలు లేకపోవడంతో పాటు డైలీ పేమెంట్స్ తో పనిచేస్తోందని అంతేకాకుండా సినిమాల్లో అభ్యంతర బోల్డ్ పాత్రలు చేయడానికి కూడా ఒప్పుకుంటోందని బాలీవుడ్, టాలీవుడ్ సినీ వర్గాలలో వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.