తెలంగాణలో సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసుపై ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది.ఈ క్రమంలో సిట్ అధికారిపై న్యాయస్థానం తీవ్రస్థాయిలో మండిపడింది.
నిందితుల బెయిల్ షూరిటీపై స్థానికులనే పరిగణనలోకి తీసుకోవాలని ఏసీబీ కోర్టులో సిట్ అధికారి మెమో దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం సిట్ అధికారి గంగాధర్ పై కోర్టు సీరియస్ అయింది.
మీరెవరు డైరెక్షన్ ఇవ్వడానికి అని న్యాయమూర్తి ప్రశ్నించారు.ఈ నేపథ్యంలో క్షమాపణ చెప్పకపోతే కోర్టు ధిక్కరణగా పరిగణిస్తామని జడ్జి హెచ్చరించారు.
దీంతో క్షమాపణ చెప్పి మెమోను ఏసీపీ గంగాధర్ వెనక్కి తీసుకున్నారు.
.






