తెలుగు ప్రేక్షకులకు టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.యూత్లో దేవరకొండకు ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే.
మరి ముఖ్యంగా అమ్మాయిల ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంది అని చెప్పవచ్చు.మొదటి పెళ్లి చూపులు సినిమాతో హీరోగా సినీ ఇండస్ట్రీకి ఎంత ఇచ్చిన విజయ్ దేవరకొండ అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరుచుకున్నాడు.
అంతే కాకుండా విజయ్ దేవరకొండ నటించిన కొన్ని సినిమాలే అయినప్పటికీ తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్క్ ని క్రియేట్ చేసుకున్నాడు.ఇక అర్జున్ రెడ్డి సినిమాతో రాత్రికి రాత్రి స్టార్ గా మారిపోయిన విషయం మనందరికీ తెలిసిందే.
ఇది ఇలా ఉంటే ఇటీవలే విజయ్ దేవరకొండ లైగర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఊహించిన విధంగా డిజాస్టర్ గా నిలిచింది.
భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా అధిక లాభాలను తెచ్చిపెడుతుంది అనుకోగా నిర్మాతలకు బోలెడు నష్టాన్ని మిగిల్చింది.ఇక లైగర్ సినిమా విడుదల తర్వాత విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ చార్మిలపై ఏ రేంజ్ లో ట్రోలింగ్స్ వచ్చాయో మనందరికీ తెలిసిందే.
అయితే లైగర్ సినిమా ఎఫెక్ట్ మొత్తం పూరి జగన్నాథ్ పై పడింది అంటూ మొన్నటి వరకు వార్తలు వినిపించాయి.అయితే ఇప్పుడు లైగర్ సినిమా ఎఫెక్ట్ విజయ్ దేవరకొండ పై కూడా పడబోతోంది అనిపిస్తోంది.

లైగర్ సినిమా పోతే పోయింది నెక్స్ట్ సినిమాతో మంచి హిట్ కొడదాము అనుకోని రిలాక్స్ అయిన విజయ్ దేవరకొండ కి లైగర్ సినిమా డిజాస్టర్ ఒక ఎఫెక్ట్ తగిలింది.అదేంటంటే విజయ్ దేవరకొండ తాజాగా ఈడీ విచారణకు హాజరైన విషయం తెలిసిందే.లైగర్ సినిమా పారితోషికం లెక్కలు వరకు విజయ్ సేఫ్.లైగర్ సినిమాకు సంబంధించిన బడ్జెట్ విషయాలపై విజయ్ దేవరకొండ బ్యాంకు ఖాతాలను ఇది అధికారులు తనకి చేస్తే తప్పకుండా ఎక్కడో తేడా కొడుతుంది అంటూ వార్తలు మొదలయ్యాయి.
అంటే విజయ్ దేవరకొండ కి లైగర్ పెట్టుబడి తో పాటు సంబంధం ఉందా లేకపోతే ఇతర కారణాల విషయంలో విజయ్ నువ్వు పిలిపించారా అన్నది అర్థం కావడం లేదు.మొత్తానికి లైగర్ డిజాస్టర్ ఎఫెక్ట్ విజయ్ దేవరకొండ పై పడేలా కనిపిస్తోంది.
విజయ్ దేవరకొండ నెక్స్ట్ సినిమా ఖుషి సినిమాపై బిజినెస్ పై ప్రభావం పడుతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.







