చేయని తప్పుకు శిక్షగా ఈ హీరోయిన్స్ సొంత కూతుళ్ళని వదులుకున్నారు..!!

ప్రతి కుటుంబంలో అమ్మకి కొడుకు, నాన్నకి కూతురు ఫేవరేట్ గా ఉంటారు.అదేంటో గాని చిన్నతనం నుండే కూతురుమీద ఎంతో ప్రేమని పెంచుకుంటాడు తండ్రి.

ప్రతి ఇంట్లోని కూతురికి తన తండ్రితో కూడా ఒక విడదీయరాని అనుబంధం ఏర్పడుతుంది.కానీ ఇంట్లో తల్లి లేకుండా ఒక ఆడపిల్ల మనుగడ సాగించడం కష్టంతో కూడుకున్న విషయమేఆడపిల్ల ప్రతి అడుగులో తండ్రి ఎంత అవసరమో తల్లి ఇంకా అవసరం.

అయితే సినిమా ఇండస్ట్రీలోని కొంతమంది సెలబ్రిటీ కపుల్ కొన్ని కారణాల వలన విడిపోయి విడాకులు తీసుకున్నాక వాళ్ళ పిల్లలు తల్లితో కాకుండా తండ్రితో వెళ్లిపోయారు.అయితే పిల్లల సంరక్షణ తండ్రి కంటే తల్లినే ఎక్కువగా చూసుకుంటుంది.

కానీ ఈ సెలబ్రిటీ పిల్లలు మాత్రం తండ్రితోనే నివసిస్తున్నారు.వాళ్లెవరో ఇప్పుడోసారి ఓ లుక్కేద్దాం.

Tollywood Actresses Left Their Daughters , Kamal Hassan, Shruti Hassan, Akshara
Advertisement
Tollywood Actresses Left Their Daughters , Kamal Hassan, Shruti Hassan, Akshara

ముందుగా ఈ లిస్టులో ఇండియన్ సూపర్ యాక్టర్స్ లో ఒకరైన కమల్ హస్సన్ గురించి చెప్పుకోవాలి.ఈయన రెండొవ భార్య హీరోయిన్ సారికకు ఇద్దరు కూతుర్లు ఉన్నారుఒకరు శృతి హస్సన్ ఇంకొకరు అక్షర హస్సన్.అయితే సారిక చిన్నప్పటి నుండే ఎన్నో కష్టాలు పడింది.

చిన్నప్పుడే చైల్డ్ ఆర్టిస్ట్ గా తన నటనా జీవితాన్ని ప్రారంభించిన సారికను ఆమె తల్లి చిత్ర హింసలకు గురించేసేదట.ఇక పెద్దయి హీరోయిన్ అయ్యాక తన తల్లి నుండి వేరుగా వచ్చేసి కమల్ హస్సన్ ని ప్రేమించి పెళ్లి కాకా ముందే గర్భవతి కూడా అయి ఇద్దరు పిల్లలకి తల్లి అయింది.

Tollywood Actresses Left Their Daughters , Kamal Hassan, Shruti Hassan, Akshara

ఆతర్వాత ఎలాగోలా పెళ్లిచేసుకొని కమల హస్సన్ పద్ధతులు నచ్చక ఆయనతో విడిపోయింది.ఇక కూతుర్లు నాన్నతోనే ఉంటాము అని అనడంతో ఒంటరి అయిపోయిన సారిక ఇప్పుడు ఒక మారుమూల గ్రామంలో ఒంటరిగా జీవిస్తుంది.ఇప్పటికి కూడా శృతి హస్సన్ అండ్ అక్షర హస్సన్ ఇద్దరు హీరోయిన్స్ అయినా వాళ్ళ అమ్మగారిని వాళ్ళతో ఉంచుకోవడం లేదు.

ఇక కమల్ మాత్రం మళ్ళీ మళ్ళీ ప్రేమలో పడుతూ పెళ్లిచేసుకుంటున్నా సారిక మాత్రం ఒంటరిగానే జీవిస్తుంది.

ఈ రెండు ఉంటే చాలు పైసా ఖర్చు లేకుండా వైట్ అండ్ గ్లాస్ స్కిన్ ను పొందొచ్చు!
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ లేటెస్ట్ రెమ్యునరేషన్ లెక్కలివే.. అంత తీసుకుంటున్నారా?

ఇక ఈ లిస్ట్ లో రెండొవ హీరోయిన్ వచ్చేసి సీత ఈమె హీరో పార్ధవన్ ని ప్రేమించి పెళ్లి చేసుకొని ఇద్దరు కూతుర్లకు తల్లి కూడా అయింది.అయితే ఆ తర్వాత అంతా బాగానే వుంది అనుకుంటున్న సమయంలో సీత, పార్ధవన్ ల మధ్య చిన్న చిన్న మనస్పర్థలు రావడంతో ఇద్దరు విడాకులు తీసుకొని విడిపోయారు.అయితే విడాకులు అప్పుడు చిన్న పిల్లలైన వాళ్ళ కూతుర్లను పార్ధివన్ సీతకి ఇవ్వడానికి ఇష్టపడలేదు.

Advertisement

సీత కూడా వాళ్ళని తీసుకెళ్లడానికి ప్రయత్నించకుండా వాళ్ళని వదిలేసి వెళ్లిపోయింది.

ఆ తర్వాత కొన్నాళ్ళకు తనతో పాటే నటిస్తున్న సతీష్ ని ప్రేమించి పెళ్లిచేసుకొన్న సీత అతనికి కూడా విడాకులు ఇచ్చేసి ప్రెసెంట్ ఒంటరిగానే జీవితాన్ని గడిపేస్తుంది.కానీ పార్ధివన్ మాత్రం కూతుర్ల కోసం పెళ్లి చేసుకోకుండా వాళ్ళని పెద్ద చేసి ఇటీవలే వాళ్ళకి అంగరంగ వైభవంగా పెళ్లి కూడా చేసాడు.ఏదిఏమైనా సీత కూతుర్లను చిన్నతనం నుండే పట్టించుకోలేదన్నది మాత్రం నిజం.

ఇక ఈ లిస్ట్ లో నాటి హీరోయిన్ ఊర్వశిఈమె సహా నటుడు మనోజ్ ని ప్రేమించి పెళ్లిచేసుకొని ఒక కూతురుకి జన్మనిచ్చింది.కానీ ఉర్వశికి తాగుడు అలవాటు ఉండడం వలన ప్రతిరోజు తాగితాగి నానా రచ్చ చేస్తుండడం వలన అది తట్టుకోలేని మనోజ ఊర్వశి నుండి విడాకులు తీసుకున్నాడు.అయితే ఊర్వశి ఆమె కూతురు కోసం పోరాటం చేసినా తన కూతురు మాత్రం నేను నాన్న దగ్గరే పెరుగుతాను ఆయనదగ్గరే వుంటాను అని కోర్టుకెక్కడంతో ఇక ఊర్వశి వాళ్ళని వదిలేసి మళ్ళీ పెళ్లిచేసుకొని ఒక బాబుకి జన్మనిచ్చింది కానీ తన కన్న కూతురికి మాత్రం ఇప్పటికి ఒక శత్రువుగానే మిగిలిపోయింది.

అదండీ, ఇలా విడిపోయి పిల్లలను దూరం చేసుకున్న తల్లులు ఎంతోమంది వున్నారు రానున్న రోజుల్లో ఇది మరింత కఠినంగా మారే అవకాశం కూడా ఉంది.

తాజా వార్తలు