హోటల్ లోకి చొరబడ్డ ముగ్గురు ఉగ్రవాదులు....మృతి!

పొరుగుదేశం పాకిస్థాన్ లో మరోసారి ఉగ్రవాదులు విధ్వంశం సృష్టించడానికి ప్రయత్నించారు.ఇటీవల ఏప్రిల్ 18 న పాక్ లో ఉగ్రవాదులు దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే.

ఈ ఘటనలో 14 మంది ప్రాణాలు కూడా కోల్పోయారు.ఇంకా ఆ ఘటన మరువక ముందే శనివారం సాయంత్రం ముగ్గురు ఉగ్రవాదులు పాక్ లోని ఒక హోటల్ లోకి చొరబడినట్లు తెలుస్తుంది.

గ్వదార్ లో గల పెరల్ కాంటినెంటల్ హోటల్ లోకి ముగ్గురు ఉగ్రవాదులు చొరబడ్డారు.ఈ క్రమంలో సెక్యూరిటీ గార్డు ను హతమార్చి మరీ వారు హోటల్ లోకి ప్రవేశించారు.

అయితే ఆ సమయంలో హోటల్ లో 70 మంది పర్యాటకులు ఉన్నట్లు తెలుస్తుంది.అయితే వెంటనే అప్రమత్తమైన భద్రతా దళాలు ఉగ్రవాదుల తో హోరా హోరీ గా తలపడి ఆ ముగ్గురుని హతమార్చినట్లు సమాచారం.

Advertisement

శనివారం సాయంత్రం 4:50 గంటల సమయంలో ఉగ్రవాదులు హోటల్ లోకి చొరబడినట్లు తెలుస్తుంది.దీనితో వెంటనే సమాచారం అందుకున్న భద్రతా దళాలు హుటాహుటిన అక్కడకి చేరుకొని ఉగ్రవాదుల తో తలపడ్డారు.

దీనితో ఉగ్రవాదులు ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, ఆ హోటల్ లో ఉన్న సందర్శకులు,హోటల్ సిబ్బంది కొందరు గాయపడినట్లు తెలుస్తుంది.ఈ ఉగ్రదాడి ఘటనకు తమదే బాధ్యతంటూ నిషేధిత బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ శనివారం ప్రకటించుకుంది.

అఫ్గానిస్తాన్, ఇరాన్ దేశాలతో సరిహద్దు పంచుకుంటున్న గ్వదర్.పాక్ లోని అత్యంత సమస్యాత్మక ప్రాంతంగా చెప్పుకోవాలి.

వీడియో వైరల్ : శోభనం గదిలో ఆలియా, రణ్ వీర్.. ఇదే తొలిసారి అంటూ..

Advertisement

తాజా వార్తలు