కంటి చూపును మెరుగుపరిచే ఈ మూడు ఆకుకూర‌లు తింటున్నారా?

వ‌య‌సు పెరిగే కొద్ది కంటి చూపు త‌గ్గ‌డం స‌ర్వ సాధార‌ణం.కానీ, నేటి ఆధునిక కాలంలో చిన్న వ‌య‌సు వారిలో సైతం ఈ స‌మ‌స్య క‌నిపిస్తోంది.

అధిక ఒత్తిడి, ఆహార‌పు అల‌వాట్లు, జీవ‌న శైలిలో మార్పులు, పోష‌కాల లోపం, స్మార్ట్ ఫోన్‌, టీవీ, ల్యాప్‌టాప్ వంటి ఎల‌క్ట్రానిక్ గాడ్జెట్స్‌ను అతిగా వాడ‌టం ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల కంటి చూపు మంద‌గిస్తూ ఉంటుంది.అయితే ఏదైనా జబ్బు వస్తే మందు వేసుకుని ఉపశమనం పొందవ‌చ్చు.

కానీ కంటి చూపు సమస్య అలాంటిది కాదు.సరైన ఆహారం తీసుకుంటే కంటి చూపు మెరుగు ప‌డుతుంది.

అయితే కంటి చూపును పెంచ‌డంలో ఓ మూడు ఆకుకూర‌లు అద్భుతంగా స‌హాయ‌ప‌డ‌తాయి.మ‌రి ఆ ఆకుకూర‌లు ఏంటీ అన్న‌ది ఆల‌స్యం చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

కంటి చూపును పెంచ‌డంలో గోంగూర ఎఫెక్టివ్‌గా ప‌ని చేస్తుంది.గోంగూర‌లో ఇత‌ర పోష‌కాల‌తో పాటు విట‌మిన్ ఎ మ‌రియు బీటా కెరొటిన్ పుష్క‌లంగా ఉంటాయి.అందు వ‌ల్ల‌, గోంగూర‌ను త‌ర‌చూ తీసుకుంటూ ఉంటే కంటి చూపు క్ర‌మ‌క్ర‌మంగా పెరుగుతుంది.

రేచీకటికి స‌మ‌స్య ఉన్నా దూరం అవుతుంది.అలాగే కంటి ఆరోగ్యానికి మేలు చేసే మ‌రో అద్భుమైన ఆకుకూర మున‌గాకు.

మూడు వంద‌లకు పైగా వ్యాధులను నయం చేయ‌గ‌ల స‌త్తా మున‌గాకు ఉంటుంది.అటువంటి దానిని రోజూ ఏదొక రూపంలో తీసుకుంటే శ‌రీరానికి బోలెడ‌న్ని ప్ర‌యోజ‌నాలు చేకూర‌డంతో పాటుగా కళ్లకు మంచి పోష‌ణ అంది చూపు చ‌క్క‌గా మెరుగ‌ప‌డుతుంది.

ఇక కొత్తిమీరకి సైతం కంటి చూపును పెంచే సామ‌ర్థ్యం ఉంది.కంటి ఆరోగ్యానికి ఉప‌యోగ‌ప‌డే ఎన్నో పోష‌కాలు కొత్తిమీర ద్వారా పొందొచ్చు.అందుకే రెగ్యుల‌ర్‌గా ఏదో ఒక రూపంలో కొత్తిమీర‌ను తీసుకోవ‌డం లేదా వారంలో రెండు సార్లు కొత్తిమీర ర‌సం తీసుకోవ‌డం చేస్తే కంటి చూపు పెరుగుతుంది.

రాజమౌళి వల్లే టాలీవుడ్ హీరోలకు ఈ స్థాయిలో గుర్తింపు.. నమ్మకపోయినా నిజమిదేనా?
రైతు పండుగ :నేడు రేవంత్ చెప్పనున్న ఆ రెండు శుభవార్తలు ఏంటి ? 

అదే స‌మ‌యంతో ఇత‌ర కంటి సంబంధిత స‌మ‌స్య‌లు ప‌రార్ అవుతాయి.

Advertisement

తాజా వార్తలు