అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం: ముగ్గురు తెలంగాణ వాసులు దుర్మరణం

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదం ఓ తెలుగు కుటుంబంలో తీరని దు:ఖాన్ని మిగిల్చింది.టెక్సాస్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తెలంగాణ వాసులు దుర్మరణం పాలవ్వగా.

మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.వివరాల్లోకి వెళితే.

మరికల్ మండలం పెద్ద చింతకుంట గ్రామానికి చెందిన నరసింహారెడ్డి, లక్ష్మీ దంపతులకు మౌనిక, భరత్‌ సంతానం.వీరు అమెరికాకు వెళ్లి టెక్సాస్‌లో ఉద్యోగం చేస్తూ అక్కడే స్థిరపడ్డారు.

ఈ క్రమంలో నరసింహారెడ్డి, లక్షీ దంపతులు కొద్దినెలల క్రితం అమెరికాలోని కొడుకు, కూతురు వద్దకు వెళ్లారు.శనివారం బంధువుల ఇంట్లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదం సంభవించింది.

Advertisement

ఈ ఘటనలో నరసింహారెడ్డి, లక్ష్మీ, భరత్ అక్కడికక్కడే మరణించగా.తీవ్రగాయాల పాలైన మౌనిక ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతోంది.

ఇక నరసింహారెడ్డి ఆర్టీసీ కండక్టర్‌గా హైదరాబాద్‌ డిపో -1లో విధులు నిర్వహిస్తున్నారు.ఆయన వచ్చే సంవత్సరం పదవి విరమణ చేయనున్నారు.

వీరి మరణంపై అమెరికాలోని భారతీయ సమాజం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.అటు నరసింహారెడ్డి స్వగ్రామంలోనూ విషాద వాతావరణం చోటు చేసుకుంది.

ఇక టెక్సాస్ రాష్ట్రంలోని ఆస్టిన్‌లో ఈ నెల 7న జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన నేహా రెడ్డి మద్దిక అనే యువతి మరణించారు.నవంబర్ 7న తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో సౌత్ ఫస్ట్ స్ట్రీట్, వెస్ట్ మేరీ స్ట్రీట్ మధ్య రెండు వాహనాలు ఒకదానొకటి ఢీకొన్నాయి.ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నేహా రెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు.

హెచ్‎సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్..!
హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

మృతురాలికి అమెరికాలో ఎవరూ లేకపోవడంతో మృతదేహాన్ని భారత్‌కు తరలించేందుకు గాను గోఫండ్ మీ ద్వారా నిధులు సేకరించారు.ఇదే ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరో నలుగురు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు ఆస్టిన్-ట్రావిష్ కౌంటీ ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ ట్వీట్ చేసింది.

Advertisement

తాజా వార్తలు