విరాట పర్వం డైరెక్టర్ కి బెదిరింపు కాల్స్..కారణం అదేనా?

ఇటీవల దగ్గుబాటి రానా, సహజనటి సాయి పల్లవి కలసి నటించిన చిత్రం విరాటపర్వం.ఈ సినిమాని వేణు ఊడుగుల చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాడు.

1990 లో తెలంగాణలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా నక్సలిజం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది.నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూలలో పాల్గొన్న సాయి పల్లవి ఎన్నో విషయాలు వెల్లడించారు.

ఈ క్రమంలో సాయి పల్లవి కాశ్మీరీ పండిట్ హత్య, గో హింస చేసిన కొందరూ వ్యక్తుల గురించి మాట్లాడిన మాటలు సంచలనం సృష్టించాయి.దీంతో భజరంగదళ్ కార్యకర్తలు సాయిపల్లవి మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ.

ఆమె నటించిన విరాటపర్వం సినిమా బాయ్ కాట్ చేయాలి అంటూ నినాదాలు మొదలుపెట్టారు.అంతేకాకుండా విరాటపర్వం సినిమా దర్శకుడు వేణుకి కూడా బెదిరింపు కాల్స్ వచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

Advertisement

కాశ్మీర్ ఫైల్స్ సినిమాతో పాటు.గోరక్షకులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిందని భజరంగదళ్ కార్యకర్తలు సాయి పల్లవి మీద ఆరోపణలు చేస్తూ.

ఆమె మీద హైదరాబాద్ లోని సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

ఈ ఫిర్యాదు పై స్పందించిన పోలీసులు ఆమె మాట్లాడిన వీడియో పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.ఇటీవల విరాటపర్వం సినిమా దర్శకుడు వేణుకి కూడా గుర్తు తెలియని వ్యక్తుల నుండి బెదిరింపు కాల్స్ ఎదుర్కొన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఇప్పటికే సినిమా విడుదల కాకుండా ఆపేయాలని ప్రయత్నాలు చేస్తున్న భజరంగదళ్ కార్యకర్తలే.

ఈ సినిమా దర్శకుడికి కూడా ఫోన్ చేసి బెదిరించినట్టు అనుమాన పడుతున్నారు.మొత్తానికి సాయి పల్లవి వల్ల దర్శకుడు చిక్కుల్లో పడ్డాడు.

ప్రతి వారం 5 గ్రాముల బంగారం.. మణికంఠ ఇచ్చిన బంపర్ ఆఫర్ ఇదే!
ఎలాన్ మస్క్ కూడా కాపీ కొడతాడా.. ఆ డైరెక్టర్ సంచలన ఆరోపణలు..?

ఈ విషయం గురించి స్పందించిన కొందరు వ్యక్తులు సాయి పల్లవి చేసిన పనికి దర్శకుడి ని ఇబ్బంది పెట్టడం సరైన పద్ధతి కాదు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు