వావ్, ఈ కొరియన్ యువతి డాన్స్ స్టెప్పులు చూస్తే ఫిదా అవ్వాల్సిందే..

విదేశీయులు మన ఇండియాకు సంబంధించిన పాటలకు డ్యాన్సులు వేస్తూ ఆకట్టుకుంటున్నారు.

ఇటీవల ఒక దక్షిణ కొరియా మహిళ పంజాబీ డాన్స్‌తో అందరి మనసు దోచేసింది! సంస్కృతులను అద్భుతంగా మిళితం చేసిన ఈ యువతి అదిరిపోయే నృత్య ప్రదర్శనతో అందరి హృదయాలను దోచుకుంది.

"బజ్రే ద సిట్టా" ఆల్బమ్‌లోని ప్రసిద్ధ పంజాబీ పాట "సుర్మెదానీ"కి ఆమె డ్యాన్స్ చేసే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.ఈ పాటను నూర్ చాహల్, జ్యోతికా టాంగ్రీ పాడారు.

పింక్, ఆకుపచ్చ రంగుల భారతీయ దుస్తులను ధరించిన ఈ డ్యాన్సర్ సాంగ్ బీట్స్‌కు సరిపోయేలా కచ్చితమైన స్టెప్స్‌ డ్యాన్స్ చేస్తుంది.ఆమె ఈ పర్ఫామెన్స్‌తో చూపరులను ఆకట్టుకుంటుంది.ఆమె ఎక్స్‌ప్రెషన్స్‌ వావ్ అనిపించాయి.

ఇన్‌స్టాగ్రామ్ యూజర్ (@vlog_by_aman.khela) పోస్ట్ చేసిన ఈ వీడియో ఏప్రిల్ 17న విడుదలైనప్పటి నుంచి వేలాది లైక్‌లు, లక్షలాది వ్యూస్‌తో సూపర్‌ వైరల్ అయింది.

Advertisement

చాలా మంది నెటిజన్లు ఆమె డ్యాన్స్ స్కిల్స్‌కు ముగ్ధులై, ప్రేమ ఇస్తున్నారు.ఫైర్ ఇమోజీలతో కామెంట్ సెక్షన్లో నింపేస్తున్నారు.గాయని జ్యోతికా టాంగ్రీ కూడా ఈ వీడియో పై కామెంట్ చేశారు, ఆమె "నా రోజును అందంగా మార్చింది.

" అని తన ప్రశంసలు కురిపించారు.ఈ వీడియో భారతీయ సంస్కృతి ఇతర దేశాలను కూడా ఆకర్షిస్తుందనే విషయాన్ని చెప్పకనే చెబుతోంది.

ఎందుకంటే పంజాబీ సంగీతం( Punjabi music ) దక్షిణ కొరియాలో కూడా ప్రజాదరణ పొందుతోంది.దక్షిణ కొరియా డ్యాన్సర్( South Korea Dancer ) నాట్య ప్రదర్శన విభిన్న సంప్రదాయాల మధ్య అందంగా వారధిని నిర్మిస్తుంది, సంగీతం, నృత్యానికి నిజంగా ఎటువంటి సరిహద్దులు లేవని నిరూపిస్తుంది.

ఈ బ్యూటిఫుల్ వీడియోను మీరు కూడా చూసేయండి.

రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ఐటెం బ్యూటీ...
Advertisement

తాజా వార్తలు