వారానికి రెండు సార్లు ఈ ఆయిల్ ను వాడితే తెల్ల జుట్టు మీ జోలికి కూడా రాదు!

ఇటీవల రోజుల్లో ఎక్కువ శాతం మంది చిన్న వయసులోనే తల జుట్టు సమస్యతో బాధపడుతున్నారు.

తలలో నాలుగు తెల్ల వెంట్రుకలు కనిపించాయి అంటే చాలు అప్పుడే ముసలితనం వచ్చేసిందా అని బెంగ పెట్టేసుకుంటారు.

ఈ క్రమంలోనే తెల్ల జుట్టును( white hair ) కవర్ చేసుకునేందుకు కలర్ వేసుకుంటూ ఉంటారు.అయితే తెల్ల జుట్టు వచ్చాక ఇబ్బంది పడే కంటే రాకుండా ముందు జాగ్రత్త తీసుకోవడం ఎంతో ఉత్తమం.

అందుకు ఇప్పుడు చెప్పబోయే ఆయిల్ చాలా చక్కగా సహాయపడుతుంది.

వారానికి కేవలం రెండుసార్లు ఈ ఆయిల్ ను వాడితే తెల్ల జుట్టు( white hair ) మీ జోలికి కూడా రాదు.మరి ఇంతకీ ఆ ఆయిల్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.ముందుగా నాలుగు నుంచి ఐదు ఉసిరికాయలు( Amla ) తీసుకుని గింజ తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి.

Advertisement

ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులో ఒక గ్లాస్ నూనె ( Oil )పోసుకోవాలి.అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలతో పాటు వన్ టేబుల్ స్పూన్ అల్లం పొడి ( Ginger powder )వేసి ఉడికించాలి.

ఉసిరికాయ ముక్కలు ఆల్మోస్ట్ నల్లగా మారేంత వరకు చిన్న మంటపై ఆయిల్ ను మరిగించాలి.ఆపై స్టవ్‌ ఆఫ్ చేసి ఆయిల్ ను చల్లారబెట్టుకోవాలి.పూర్తిగా కూల్ అయిన అనంతరం స్ట్రైనర్ సహాయంతో ఆయిల్ ను ఫిల్టర్ చేసుకుని ఒక బాటిల్ లో స్టోర్ చేసుకోవాలి.

ఈ ఆయిల్ ను జుట్టుకు అప్లై చేసుకుని చక్కగా పదినిమిషాల పాటు హెడ్ మసాజ్ చేసుకోవాలి.నైట్ నిద్రించేముందు ఈ ఆయిల్ ను రాసుకొని మరుసటి రోజు ఉదయం మైల్డ్‌ షాంపూతో తలస్నానం చేయాలి.

వారానికి రెండంటే రెండు సార్లు ఈ ఆయిల్ ను వాడితే కనుక జుట్టులో మెలనిన్ ఉత్పత్తి తగ్గకుండా ఉంటుంది.త‌ద్వారా తెల్ల జుట్టు సమస్య తలెత్తదు.వయసు పైబడిన సరే మీ కురులు నల్లగా నిగనిగలాడుతూ మెరుస్తాయి.

మోయే మోయే మూమెంట్స్ ఫేస్ చేసిన టాప్-3 సినిమా సెలబ్రిటీస్
ఇండస్ట్రీలో అడుగు పెట్టిన 17 ఏండ్లకు తొలిసారి డబ్బింగ్ చెప్పిన విజయశాంతి..

కాబట్టి తెల్ల జుట్టు సమస్యకు దూరంగా ఉండాలి అనే భావించేవారు తప్పకుండా ఈ ఆయిల్ ను తయారు చేసుకొని వాడేందుకు ప్రయత్నించండి.

Advertisement

తాజా వార్తలు