చిరంజీవికి పాదాభివందనం చేసిన పవన్.. ఈ మూమెంట్ మెగా ఫ్యాన్స్ కు ఎంతో స్పెషల్!

ఈరోజు జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ప్రమాణ స్వీకారం చేయడం పవన్ కళ్యాణ్ అభిమానులకు ఎంతో సంతోషాన్ని కలిగించింది.

పవన్ అనే నేను అంటూ కొణిదెల పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేస్తుంటే అభిమానులకు కలిగిన సంతోషం అంతాఇంతా కాదు.

పవన్ కళ్యాణ్ ను అలా చూస్తుంటే రెండు కళ్లు చాలవని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.మరోవైపు పవన్ ను అలా చూసి చిరంజీవి సైతం ఒకింత ఎమోషనల్ అయ్యారు.

చిరంజీవికి పవన్ కళ్యాణ్ పాదాభివందనం చేయడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.ఈ మూమెంట్ మెగా ఫ్యాన్స్ కు ఎంతో స్పెషల్ అనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.నాలుగోసారి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగా పవన్ కళ్యాణ్ మొదటిసారి ప్రమాణ స్వీకారం చేయడం గమనార్హం.

పవన్ కు మంత్రి పదవి దక్కడం ఫ్యాన్స్ కు ఎంతో ఆనందాన్ని కలిగించింది.

Advertisement

జనసేన( Janasena ) విషయంలో వచ్చిన అన్ని విమర్శలకు ఈ ఎన్నికల ఫలితాలతో పవన్ కళ్యాణ్ చెక్ పెట్టారని సోషల్ మీడియా( Social media ) వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.పవన్ కు అన్ని విషయాల్లో చిరంజీవి అండగా నిలవడం గమనార్హం.పవన్ కు హోం శాఖ ఇచ్చే అవకాశం అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

పవన్ జనసేనను రాబోయే రోజుల్లో మరో స్థాయికి తీసుకెళ్తారని తెలుస్తోంది.మరోవైపు పవన్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాల పరిస్థితి ఏంటనే ప్రశ్నకు సంబంధించి త్వరలో సమాధానాలు దొరికే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

పవన్ కళ్యాణ్ భవిష్యత్తు సినిమాలన్నీ భారీ బడ్జెట్ సినిమాలు అయిన నేపథ్యంలో ఈ సినిమాలకు సంబంధించి త్వరలో పూర్తిస్థాయిలో స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది.పవన్ కెరీర్ ప్లాన్స్ కు సంబంధించి త్వరలో పూర్తిస్థాయిలో స్పష్టత వచ్చే అవకాశాలు ఉంటాయి.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఏప్రిల్ 25, ఆదివారం, 2021
Advertisement

తాజా వార్తలు