ఎక్కువ వడ్డీ వచ్చే ఎస్‌బీఐ స్పెషల్ ఎఫ్‌డీ స్కీమ్ ఇదే.. త్వరపడండి!

సీనియర్ సిటిజన్ల కోసం ప్రస్తుతం ఎన్నో పథకాలు హై రిటర్న్స్ ఆఫర్ చేస్తున్నాయి.

తాజాగా ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ (SBI) కూడా ఒక అదిరిపోయే పథకాన్ని తీసుకొచ్చింది.

ఎస్‌బీఐ వీ కేర్ స్పెషల్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ అని పిలిచే ఈ పథకం బెస్ట్ పెట్టుబడి ఆప్షన్‌లా నిలుస్తోంది.

This Is The Sbi Special Fd Scheme That Earns More Interest Hurry Up, Senior Citi

ఈ పథకం కనిష్టంగా 5 సంవత్సరాలు, గరిష్టంగా 10 సంవత్సరాల వరకు మెచ్యూరిటీతో అందుబాటులో ఉంది.60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు( Senior citizens ) మాత్రమే ఈ పథకంలో పెట్టుబడి పెట్టడానికి అర్హులు.పెట్టుబడిదారులు బేస్ రేటుపై 50 bps అదనపు వడ్డీని పొందుతారు.స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో( State Bank of India ) మామూలుగా రెగ్యులర్ ఎఫ్‌డీ చేసే సీనియర్ సిటిజన్లకు ప్రస్తుతం 7.50% వడ్డీ లభిస్తోంది.అంటే ఈ ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకం కింద సీనియర్ సిటిజన్లకు 8% వడ్డీ రేటు లభిస్తుంది.

కొత్త డిపాజిట్లు, మెచ్యూరింగ్ డిపాజిట్ల రెన్యువల్స్ రెండింటికీ ఈ పథకం అందుబాటులో ఉంది.ఈ పథకం 2023, సెప్టెంబర్ 30 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

This Is The Sbi Special Fd Scheme That Earns More Interest Hurry Up, Senior Citi
Advertisement
This Is The SBI Special FD Scheme That Earns More Interest Hurry Up, Senior Citi

కస్టమర్ తన పేరు మీద లేదా సీనియర్ సిటిజన్ అయిన జాయింట్ అకౌంట్ హోల్డర్ పేరిట ఎఫ్‌డీని( FD ) తెరవవచ్చు.ఎస్‌బీఐ WeCare స్పెషల్ ఎఫ్‌డీని దేశవ్యాప్తంగా ఉన్న ఏదైనా ఎస్‌బీఐ బ్రాంచ్‌లో తెరవవచ్చు.కస్టమర్ నగదు రూపంలో లేదా చెక్కు ద్వారా ఎఫ్‌డీలో డబ్బును డిపాజిట్ చేయవచ్చు.

ఎస్‌బీఐ WeCare స్పెషల్ ఎఫ్‌డీపై వచ్చే వడ్డీపై పన్ను విధిస్తారు.ట్యాక్స్ అనేది కస్టమర్ ఐటీ స్లాబ్‌పై ఆధారపడి ఉంటాయి.

అధిక వడ్డీ రేటుతో సురక్షితమైన పెట్టుబడి కోసం చూస్తున్న సీనియర్ సిటిజన్‌లకు ఎస్‌బీఐ WeCare స్పెషల్ ఎఫ్‌డీ మంచి ఎంపిక.

ఓరి దేవుడో.. జంతువులు మనుషుల్లా నడిస్తే ఎలా ఉంటుందో తెలుసా.. (వీడియో)
Advertisement

తాజా వార్తలు