నిమ్మకాయతో డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు జరిగే మేలు ఇదే..!

ఈ ఆధునిక కాలంలో డయాబెటిస్ తో బాధపడుతున్నారు.డయాబెటిస్ ను నివారించడానికి ఎన్నో మందులను వాడుతూ ఇబ్బందులు పడుతున్నారు.

డయాబెటిస్ ఇన్సులిన్ హార్మోన్స్ స్థాయి తగ్గడం వల్ల కలిగే అనియంత్రిత మెటబాలిజం రక్తంలో అధిక గ్లూకోస్ స్థాయి పెరగడంతో వస్తుంది.ఇక డయాబెటిస్ ఉన్నవారు తాము తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది.

ఇక డయాబెటిస్ ను అదుపులో ఉంచే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి.అలాగే డయాబెటిస్ ఉన్నవారు సమయానికి ఆహారం తీసుకోవాలి లేకపోతే ఈ వ్యాధి పెరిగే అవకాశాలు ఉన్నాయి.

ఈ వ్యాధిని పూర్తిగా తగ్గించే మందులు లేవు.జీవితాంతం తగిన జాగ్రత్తలు తీసుకొని దీన్ని అదుపులో ఉంచుకోవడం మాత్రమే సాధ్యం.

Advertisement

డయాబెటిస్ ఉన్న పేషెంట్లలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది.అందువల్ల వారికి అనేక జబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

మన శరీరంలో చక్కెర స్థాయిను నియంత్రించడానికి అనేక పద్ధతులు ఉన్నాయి.వాటిలో ఆహార పదార్థాలు కూడా కొన్ని.

డయాబెటిస్ ను తగ్గించే ఆహార పదార్థాలు తీసుకుంటే డయాబెటిస్ ను అదుపులో ఉంచవచ్చు.అయితే నిమ్మకాయ డయాబెటిస్ పేషెంట్ కు దివ్య ఔషధం.

నిమ్మకాయలో విటమిన్ ఏ, విటమిన్ సి, కార్బోహైడ్రేట్లు ఫైబర్, ప్రోటీన్లు వంటి పోషకాలు అధికంగా లభిస్తాయి.నిమ్మకాయలు పొటాషియం, క్యాల్షియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. నిమ్మకాయలో గ్లైసెమిక్ చాలా తక్కువగా ఉంటుంది.

ఆ ఒక్క సినిమా నా జీవితాన్నే మార్చేసింది... రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
రవితేజ కి రెమ్యూనరేషన్ ఎక్కువగా ఇస్తే కథ కూడా వినకుండా సినిమా చేసేస్తాడా..?

ఇది మధుమేహాన్ని అదుపులో ఉంచడానికి ఉపయోగపడుతుంది.రోజు భోజనానికి ముందు ఒక గ్లాసు నిమ్మరసం తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి 45 నిమిషాల్లో తగ్గే అవకాశాలు ఉన్నాయి.

Advertisement

గ్రీన్ టీ, బ్లాక్ టీ మొదలైన వాటికి నిమ్మరసం కలిపి తాగడం వల్ల బరువు తగ్గే అవకాశాలు ఉన్నాయి.అందువల్ల చక్కెర నియంత్రణ కోసం తరచుగా నిమ్మకాయ నీటిని డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తీసుకుంటే చాలా మంచిది.

తాజా వార్తలు