ఇదేం కారు, జంక్‌యార్డ్ నుంచి డైరెక్ట్‌గా తీసుకొచ్చినట్టుంది.. ఉబర్‌ను ఏకిపారేశాడు!

ఇటీవల కాలంలో రైడ్ షేరింగ్ కంపెనీలపై తీవ్ర ఎత్తున విమర్శలు వస్తున్నాయి.ఈ నేపథ్యంలోనే రోహిత్ అరోరా (Rohit Arora)అనే వ్యక్తి ఊబర్‌పై నిప్పులు చెరిగాడు.

విషయం ఏంటంటే, అతను బుక్ చేసిన ఉబర్‌ క్యాబ్ (Uber Cab)చూస్తే ఎవరికైనా చిర్రెత్తుకొస్తుంది.దుమ్ము, ధూళితో నిండి, చిరిగిపోయిన సీట్లతో, మెయింటెనెన్స్ అంటే ఏమిటో ఎరుగని రీతిలో ఉందది.

దాంతో రోహిత్ ఆగ్రహం కట్టలు తెంచుకుంది."ఇదేం కర్మరా బాబు" అంటూ సోషల్ మీడియా వేదికగా ఉబర్‌ను ఏకిపారేశాడు.

"మెర్సిడెస్ బెంజ్(Mercedes-Benz), ఫ్యాన్సీ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కావాలని నేను అడగట్లేదు.కనీసం శుభ్రంగా, నీట్‌గా ఉండే కారు కావాలి కదా?" అంటూ ఉబర్‌ను నిలదీశాడు."భారతదేశంలో ఉబర్‌కు(Uber has no standard in India కనీస ప్రమాణాలు కూడా లేవు.

Advertisement

ఈ కారు చూస్తే జంక్‌యార్డ్ నుంచి డైరెక్ట్‌గా తీసుకొచ్చినట్టుంది" అంటూ X (ట్విట్టర్)లో పోస్ట్ చేశాడు.ఉబర్‌ ఇండియా, ఉబర్‌ సపోర్ట్, ఉబర్‌ అధికారిక ఖాతాలను ట్యాగ్ చేస్తూ తన అసహనాన్ని వ్యక్తం చేశాడు.

ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.రోహిత్ అరోరా అసలు విషయం చెప్పేశాడు.తన దగ్గర సొంత కారు ఉన్నా, ఎప్పుడైనా అర్జెంటుగా వెళ్లాల్సి వస్తే ఉబర్‌ ప్రయారిటీ లేదా ప్రీమియర్ బుక్ చేస్తానన్నాడు.

కానీ, ఉబర్‌ మాత్రం కనీస శుభ్రత పాటించకపోవడంపై ఫైర్ అయ్యాడు."కార్లను శుభ్రంగా ఉంచడం పెద్ద కష్టమేమీ కాదు.

కొంచెం శ్రద్ధ పెడితే చాలు.దాని కోసం డ్రైవర్లు ప్రత్యేకంగా డబ్బులు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు" అని కుండబద్దలు కొట్టాడు.

వీడియో: ఈ డోర్ ఎంత బలంగా ఉందో.. ఏనుగులు తోసినా అంగుళం కదలదట..!!
వీడియో: ఈ డోర్ ఎంత బలంగా ఉందో.. ఏనుగులు తోసినా అంగుళం కదలదట..!!

అంటే, ఉబర్‌ డ్రైవర్లు(Uber Ride) కాస్తంత మనసు పెడితే కార్లను మెయింటెయిన్ చేయొచ్చు అనేది రోహిత్ వాదన.ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.

Advertisement

ఇక ఉబర్‌ కూడా దిగొచ్చింది.రోహిత్ పోస్ట్‌పై వెంటనే స్పందించింది.జరిగిన ట్రిప్ వివరాలు, కాంటాక్ట్ నెంబర్, ఎప్పుడు వెళ్లారు అనే డేట్, టైమ్ లాంటి డీటెయిల్స్ అడిగింది.

"వెంటనే ఈ విషయాన్ని పరిశీలిస్తాం" అని ప్రామిస్ చేసింది.మరి ఏం జరుగుతుందో చూడాలి! మరోవైపు ఇతర ప్యాసింజర్లు కూడా డర్టీ కార్స్, అన్‌ప్రొఫెషనల్ డ్రైవర్స్, సర్వీస్ సమస్యలను హైలెట్ చేస్తూ ఏకపారేశారు.

ఉబర్ వెహికల్ స్టాండర్డ్స్, కస్టమర్ సర్వీస్ ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు.

తాజా వార్తలు