నేను బిగ్ బాస్ వెళ్లడం వాళ్లకు నచ్చలేదు.. చంటి కామెంట్స్ వైరల్!

బుల్లితెర అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం ఆదివారం ఎంతో ఘనంగా ప్రారంభమైంది.ఈ కార్యక్రమంలోకి మొత్తం 21 మంది కంటెస్టెంట్స్ పాల్గొన్నారు.

ఇక ఇప్పటికే హౌస్ సభ్యులను బిగ్ బాస్ క్లాస్ మాస్ ట్రాష్ అంటూ విడదీసి వీరి మధ్య టాస్కులు నిర్వహిస్తూ పెద్ద ఎత్తున పోటీలు పెడుతున్నారు.ఇకపోతే బిగ్ బాస్ కార్యక్రమంలోకి జబర్దస్త్ కార్యక్రమంలో నుంచి చలాకి చంటి వెళ్ళిన విషయం మనకు తెలిసిందే.

ఈయన జబర్దస్త్ కార్యక్రమానికి వెళ్లేముందు ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.తనకు ఎప్పటినుంచో బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లాలని ఉందని అయితే ఈసారి తనకు ఆ అవకాశం వచ్చిందని తెలిపారు.

ఇక తనకు బిగ్ బాస్ అవకాశం రాగానే ఈ విషయాన్ని మల్లెమాల వారితో చెబితే వాళ్లు తనని బిగ్ బాస్ కార్యక్రమానికి పంపించడానికి ఇష్టపడలేదని చంటి తెలిపారు.బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లడం అవసరమా ఒకసారి ఆలోచించుకోండి అంటూ తనకు సలహా ఇచ్చారని చంటి వెల్లడించారు.

Advertisement

అయితే తనకు డబ్బు అవసరం ఉందని తనపై కొన్ని బాధ్యతలు ఉన్నాయని తప్పకుండా ఈ కార్యక్రమానికి వెళ్లాలని చెప్పడంతో మనం ఇంకో షో ఏదైనా ప్లాన్ చేద్దాం ఉండండి అంటూ తనని వెళ్ళనివ్వలేదని తెలిపారు.

ఇలా మల్లెమాలవారు తనని బిగ్ బాస్ కార్యక్రమానికి పంపించడానికి ఇష్టపడలేదని అయితే తాను మాత్రం బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లి వచ్చిన తర్వాత కొత్త షో ప్లాన్ చేద్దామని చెప్పినట్టు చంటి వెల్లడించారు.సాధారణంగా ఒకసారి జబర్దస్త్ కార్యక్రమం నుంచి బయటకు వచ్చిన తర్వాత తిరిగి ఆ కార్యక్రమంలోకి ఎవరిని తీసుకోరు కానీ తాను మాత్రం బిగ్ బాస్ అనంతరం జబర్దస్త్ కార్యక్రమానికి వస్తానని చెప్పడంతో అందుకు మల్లెమాలవారు ఒప్పుకున్నారని ఈ సందర్భంగా చంటి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు