నన్ను దారుణంగా మోసం చేసింది వీళ్ళే... దుర్గారావు ఎమోషనల్ కామెంట్స్

టిక్ టాక్ తో ఎంతో మంది ఎంతో మంది లక్షల ఫాలోయర్లను సంపాదించుకున్నారు.అయితే టిక్ టాక్ నిషేధంతో ఒక్కసారిగా వారందరూ కనుమరుగైపోయారు.

కాని కొంత మంది వివిధ మాధ్యమాల ద్వారా మరల వెలుగులోకి వచ్చినా కొంతమంది మాత్రమే నిలబడ్డారు.అందులో టిక్ టాక్ స్టార్ దుర్గారావు.

రఘు కుంచె సంగీత దర్శకత్వంలో వచ్చిన నాదీ నక్కిలేసు గొలుసు పాటతో ఒక్కసారిగా ఓవర్ నైట్ స్టార్ లుగా మారిపోయారు.ఇక వారు బుల్లితెరపై రకరకాల కార్యక్రమాల ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యారు.

తాజాగా క్రాక్ సినిమాలో, అదే విధంగా జగపతి బాబు సినిమాలో నటించాడు.అయితే దుర్గారావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

Advertisement

నేను ఎవరినైతే నమ్ముకున్నానో వారే నన్ను మోసం చేస్తున్నారని అన్నారు.ఈ వ్యాఖ్యల వెనుక అర్థం ఒకసారి గమనిస్తే టిక్ టాక్ స్టార్ గా వెలుగులోకి వచ్చిన దుర్గారావు కేవలం 1 నిమిషం నిడివితో చేసిన వీడియోలలో మాత్రమే చేసేవారు.

అయితే వాటికి అప్పుడు మంచి స్పందన వచ్చింది.కాని వెండితెర మీద, బుల్లితెర మీద సత్తా చాటాలంటే మనలో నటించగల సత్తా ఉండాలి.

అయితే దుర్గారావు వేసిన స్టెప్పులే వేస్తున్నారని ప్రేక్షకులు బోర్ గా ఫీల్ అవుతున్నారని, దుర్గారావుకు ఆదరణ తగ్గుతొందని వార్తలు వినిపిస్తున్నాయి.నేను నమ్ముకున్న నా అభిమానులు ఇప్పుడు మోసం చేసారని దుర్గారావు అనుకుంటున్నారు.

ఐతే కొత్త దనం చూపిస్తే తప్పకుండా ఆదరిస్తారని దుర్గారావుకు పలువురు సూచిస్తున్నారట.

ఆ బ్రాండ్ కార్లపై టాలీవుడ్ మోజు.. నాగ్ కొత్త కారు ఖరీదు ఏకంగా అన్ని రూ.కోట్లా?
Advertisement

తాజా వార్తలు