ODI World Cup India Cricket Team: వన్డే వరల్డ్ కప్ భారత్ గెలవాలంటే ఈ ముగ్గురు ఉండాల్సిందే... లేదంటే?

ప్రపంచ క్రికెట్ క్రీడాభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న ICC మెగా ఈవెంట్ వచ్చే ఏడాది జరగబోతోందనే విషయం తెలిసినదే.కాగా దీనికి భారత్ వేదికగా నిలువనుంది.

అవును, ICC వన్డే వరల్డ్ కప్-2023 వచ్చే సంవత్సరం ఇదే సమయానికి అంటే అక్టోబర్, నవంబర్ మధ్య భారత్‌లో జరగనుంది.ఈమధ్య జరిగిన టీ-20 వరల్డ్ కప్‌లో భారత్ సెమీ ఫైనల్‌లో ఓడిపోవడంతో వచ్చే ఏడాది జరగనున్న వన్డే వరల్డ్ కప్‌లో అయినా టీమిండియా గెలిస్తే బావుండనని అభిమానులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.

ఇకపోతే గత కొంతకాలంగా భారత్ ఆటగాళ్లు మంచి ఆటతీరుని ప్రదర్శిస్తున్నారు.దీంతో వన్డే వరల్డ్ కప్ -2023‌లో భారత్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

అయితే ఇండియా గెలవాలంటే ముఖ్యంగా టీమ్ మేనేజ్‌మెంట్ వన్డే వరల్డ్ కప్-2023 కోసం బౌలింగ్ విభాగంపై ప్రధానంగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది.ఎందుకంటే ఇటీవల కాలంలో భారత్ బౌలింగ్ దళం దారుణంగా విఫలమవుతుంది.

Advertisement

టీమ్ భారీ స్కోర్ చేసినా ఓడిపోయిన సందర్భాలు అనేకం మనం చూసాము.వన్డే వరల్డ్ కప్-2023 దృష్టిలో ఉంచుకుని జట్టులో చేయాల్సిన మార్పులపై క్రికెట్ పండితులు కొన్ని సలహాలు, సూచనలు చేస్తున్నారు.

హర్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా వంటి ఆల్ రౌండర్లు ఉన్నప్పటికీ టాప్ సిక్స్‌లో బ్యాటింగ్‌తో పాటు, కొన్ని ఓవర్లు బౌలింగ్ చేసే బ్యాకప్ ఆల్ రౌండర్లు జట్టుకు చాలా అవసరం అని చెబుతున్నారు.ముఖ్యంగా బ్యాకప్ ఆల్ రౌండర్ల జాబితాలో కృనాల్ పాండ్యా, వెంకటేశ్ అయ్యార్, రిషి ధావన్ ఖచ్చితంగా ఉండాలని క్రికెట్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు.రిషి ధావన్ 2016లో ఆస్ట్రేలియాపై వన్డేల్లో అరంగేట్రం చేసిన సంగతి తెలిసినదే.2021-22 విజయ్ హజారే ట్రోఫీలో ధావన్ అద్భుత ప్రదర్శన చేశాడు.ఇక కృనాల్ పాండ్యా వన్డే ఫార్మాట్‌లో తన తొలి మ్యాచ్‌లోనే దుమ్ముదులిపేసాడు.

వెంకటేశ్ అయ్యర్ ఈ ఏడాది జనవరిలో దక్షిణాఫ్రికాతో వన్డే కెరీర్‌ను అద్భుతంగా ప్రారంభించాడు.

ఈ సంగతి తెలిస్తే, మీరు ఇక పానీపూరి బండివంక కన్నెత్తి కూడా చూడరు!
Advertisement

తాజా వార్తలు