ఈ టీని మీ జుట్టుకు రాస్తే చుండ్రు స‌మ‌స్యే ఉండ‌ద‌ట‌..తెలుసా?

పిల్ల‌లు, పెద్ద‌లు అనే తేడా లేకుండా చాలా మందిలో క‌నిపించే జుట్టు స‌మ‌స్య‌ల్లో చుండ్రు ముందు వ‌ర‌స‌లో ఉంటుంది.

కాలుష్యం, డెడ్ స్కిన్ సెల్స్‌, కెమిక‌ల్స్ ఎక్కువ‌గా ఉండే హెయిర్ ప్రోడెక్ట్స్‌ను వాడ‌టం, దుమ్ము, ధూళి, తల స్నానం చేయ‌క పోవ‌డం, బ్యాక్టీరియా ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల చుండ్రు ఏర్ప‌డుతుంది.

కార‌ణం ఏదైన‌ప్ప‌టికీ.కొంద‌రు ఎన్ని చేసినా చుండ్రు వ‌ద‌ల‌నే వ‌ద‌ల‌దు.

ఎన్ని నూనులు మార్చినా, ర‌క‌ర‌కాల షాంపూలు వాడినా చుండ్రు స‌మ‌స్య ఇబ్బంది పెడుతూనే ఉంటుంది.అయితే ఎటువంటి చుండ్రునైనా ఒక టీ అద్భుతంగా నివారించ‌గ‌ల‌దు.

అదే చామంతి టీ.వాస్త‌వానికి ప్ర‌త్యేక రుచి క‌లిగి ఉండే చామంతి టీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.ఎన్నో ప్ర‌యోజ‌నాల‌నూ అందిస్తుంది.

Advertisement

అలాగే కేశ సంర‌క్ష‌ణ‌లోనూ చామంతి టీ ఉప‌యోగ‌ప‌డుతుంది.ముఖ్యంగా చుండ్రును వ‌దిలించ‌డంలో ఈ టీ ఎఫెక్టివ్‌గా ప‌ని చేస్తుంది.

మ‌రి ఇంత‌కీ చామంతి టీని కేశాల‌కు ఎలా ఉప‌యోగించాలి.? అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా హాట్ వాట‌ర్‌లో చామంతి టీ బ్యాగ్‌ను వేసి టీ త‌యారు చేయాలి.

ఇప్పుడు బౌల్ తీసుకుని అందులో మూడు స్పూన్ల హెన్నా పొడి, ఒక స్పూన్ వేప పొడి, స‌రిప‌డా చామంతి టీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని త‌ల మొత్తానికి ప‌ట్టించి.

గంట త‌ర్వాత కెమిక‌ల్స్ త‌క్కువ‌గా ఉంటే షాంపూతో త‌ల స్నానం చేయాలి.ఇలా వారంలో రెండు సార్లు చేస్తే గ‌నుక చుండ్ర స‌మ‌స్యే ఉండ‌దు.

కల్కి పై మోహన్ బాబు రివ్యూ...భారీగా ట్రోల్ చేస్తున్న నెటిజన్స్!
స్కిన్ వైటెనింగ్ కోసం ఆరాట‌ప‌డుతున్నారా? అయితే ఈ ఆయిల్ మీకోస‌మే!

ఒక ఒక క‌ప్పు చామంతి టీతో మూడు స్పూన్ల నిమ్మ ర‌సం యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని ఒక స్ప్రే బాటిల్‌లో నింపుకోవాలి.అపై ఈ మిశ్ర‌మాన్ని త‌ల‌కు బాగా ప‌ట్టేలా స్ప్రే చేసుకోవాలి.

Advertisement

అర గంట త‌ర్వాత గోరు వెచ్చ‌ని నీటితో హెడ్ బాత్ చేసేయాలి.ఇలా చేసినా చుండ్రు క్ర‌మంగా పోతుంది.

మ‌రియు హెయిర్ షైనీగా మెరుస్తుంది.

తాజా వార్తలు