చిన్న వ‌య‌స్సులోనే క‌ళ్ల‌ద్దాలు ప‌డ‌కుండా ఉండాలంటే ఈ ఫుడ్స్ తినాల్సిందే!

ప్ర‌స్తుత రోజుల్లో కంటి సంబంధిత స‌మ‌స్యల‌తో స‌త‌మ‌తం అవుతున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది.

ముఖ్యంగా కంటి చూపు లోపించ‌డం అనేది చాలా అంటే చాలా కామ‌న్ గా వినిపిస్తోంది.

ఒక‌ప్పుడు వ‌య‌సు పైబ‌డిన వారిలోనే కంటి చూపు లోపించేది.కానీ, ఇప్పుడు ప‌దేళ్ల పిల్ల‌ల్లో సైతం ఈ స‌మ‌స్య త‌లెత్తుతుండ‌టంతో.

చిన్న వ‌య‌స్సులోనే క‌ళ్ల‌ద్దాలు ప‌డుతున్నాయి.ఈ పరిస్థితి మీ పిల్ల‌ల‌కు రాకుండా ఉండాలంటే.

త‌ప్ప‌కుండా ఇప్పుడు చెప్ప‌బోయే ఫుడ్స్‌ను వారి డైట్‌లో చేర్చండి.క్యాప్సిక‌మ్‌.

Advertisement

దీని గురించి ఎంత చెప్పుకున్నా త‌క్కువే.ధ‌ర కాస్త ఎక్కువే అయిన‌ప్ప‌టికీ.

అందుకు త‌గ్గా పోష‌కాలు క్యాప్సిక‌మ్‌లో పుష్క‌లంగా నిండి ఉంటాయి.అవి మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

ముఖ్యంగా చిన్న వ‌య‌స్సులోనే క‌ళ్ల‌ద్దాలు ప‌డ‌కుండా ఉండాలంటే క్యాప్సిక‌మ్‌ను త‌ప్ప‌కుండా తీసుకోవాలి.క్యాప్సికంలో ఉండే విటమిన్ ఎ, బీటా కెరోటిన్ త‌దిత‌ర పోష‌కాలు కంటి చూపును అద్భుతంగా మెరుగుప‌రుస్తాయి.

అదే స‌మ‌యంలో ఇత‌ర కంటి సంబంధిత సమస్యలు రాకుండా కూడా అడ్డుక‌ట్ట వేస్తాయి.

అల్లంతో అధిక హెయిర్ ఫాల్ పరార్.. ఎలా వాడాలంటే?
అక్కడ నాని మూవీ కేవలం 5 థియేటర్లలో రిలీజవుతోందా.. అసలేం జరిగిందంటే?

క్యారెట్‌.కంటి ఆరోగ్యానికి ఎంత‌ మేలు చేస్తుందో అంద‌రికీ తెలుసు.అయినా స‌రే క్యారెట్‌ను చాలా మంది నిర్ల‌క్ష్యం చేస్తుంటారు.

Advertisement

కానీ, కంటి ఆరోగ్యం బాగుండాల‌న్నా, చూపు స‌రిగ్గా క‌నిపించాల‌న్నా రోజుకొక క్యారెట్‌ను తీసుకోవ‌డం మాత్రం మ‌ర‌చిపోకూడ‌దు.చేప‌లు.

కంటి చూపును పెంచ‌డంతో గ్రేట్‌గా హెల్ప్ చేస్తాయి.చేప‌ల‌ ద్వారా ల‌భించే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చూపును రెట్టింపు చేయ‌డానికి ప్ర‌యోజ‌క‌రంగా ఉంటాయి.

అందుకే వారంలో క‌నీసం ఒక్క‌స‌రైనా చేప‌ల‌ను తీసుకునేందుకు ప్ర‌య‌త్నించాలి.

ఇక ఆకుకూర‌లు కూడా కంటి ఆరోగ్యానికి ర‌క్ష‌ణ‌గా ఉంటాయి.ముఖ్యంగా పాలకూర, కాలే, తోట‌కూర‌, మెంతికూర వంటి ఆకూకూర‌ల‌ను డైట్‌లో ఉండేలా చూసుకుంటే చిన్న వ‌య‌స్సులోనే క‌ళ్ల‌ద్దాలు ప‌డ‌కుండా ఉంటాయి.

తాజా వార్తలు