ఈ ఫుడ్స్ డైట్‌లో ఉంటే మౌత్ అల్సర్ ద‌రి చేర‌నే చేర‌దు..తెలుసా?

మౌత్ అల్స‌ర్‌(నోటి పూత‌).పిల్ల‌లు, పెద్ద‌లు అనే తేడా లేకుండా ఎంద‌రినో త‌ర‌చూ వేధించే కామ‌న్ స‌మ‌స్య ఇది.

మౌత్ అల్స‌ర్ చిన్న స‌మ‌స్యే అయిన‌ప్ప‌టికీ.దాని కార‌ణంగా వ‌చ్చే నొప్పి మాత్రం ఎంతో తీవ్రంగా ఉంటుంది.

అందుకే మౌత్ అల్స‌ర్ అంటేనే చాలా మంది భ‌య‌ప‌డిపోతుంటారు.అయితే నోటి పూత వ‌చ్చాక బాధ ప‌డ‌టం కంటే రాకుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం ఎంతో మేలని అంటున్నారు నిపుణులు.

మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం ఆ ఫుడ్స్ ఏంటో తెలుసుకుందాం ప‌దండీ.మౌత్ అల్స‌ర్‌కు అడ్డు క‌ట్ట వేయ‌డంలో ఫోలిక్ యాసిడ్ ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది.

Advertisement

అందువ‌ల్ల, బొప్పాయి పండు, ఆరెంజ్‌, అర‌టి పండు, అవ‌కాడో, బ్రొకోలీ, క్యాలీఫ్ల‌వ‌ర్‌, బెండ‌కాయ‌, క్యాప్సిక‌మ్‌, ప‌చ్చి బీట్‌రూట్‌, చికెన్ లివ‌ర్‌, రెడ్ బీన్స్‌, బాదం ప‌ప్పు, పిస్తా ప‌ప్పు, వాల్ న‌ట్స్‌, గుడ్డు, ఆకుకూర‌లు వంటివి ఆహారంలో భాగంగా చేసుకుంటే గ‌నుక శ‌రీరానికి ఫోలిక్ యాసిడ్ పుష్క‌లంగా అందుతుంది.ఫ‌లితంగా మౌత్ అల్స‌ర్ ద‌రి చేర‌కుండా ఉంటుంది.

అలాగే శ‌రీరంలో ఐర‌న్ త‌గ్గితే ర‌క్త హీన‌త బారిన ప‌డ‌తార‌ని అంద‌రికీ తెలుసు.అయితే ఐర‌న్ లోపం వ‌ల్ల నోటి పూత సైతం త‌ర‌చూ ఇబ్బంది పెడుతుంటుంది.అందుకే ఐర‌న్ పొంద‌డం కోసం ఖ‌ర్జూరాలు, నువ్వులు, గుమ్మ‌డి కాయ గింజ‌లు, డార్క్ చాక్లెట్స్‌, ఎండు ద్రాక్ష‌లు, ఓట్స్‌, మెంతికూర‌, క్యారెట్‌, పాలు, పెరుగు, ప‌న్నీర్‌, వేరుశ‌న‌గ‌లు, కిడ్నీ బీన్స్ వంటి ఆహారాల‌ను డైట్‌లో చేర్చుకోవాలి.

త‌ద్వారా త‌ర‌చూ మౌత్ అల‌ర్స్ బారిన ప‌డ కుండా ఉండొచ్చు.

ఇక ఈ ఫుడ్స్‌తో పాటు నోటిని ఎప్పుడూ ప‌రిశుభ్రంగా ఉంచుకోవాలి.ఉద‌యం, సాయంత్రం బ్రెష్ చేసుకోవాలి.మ‌రియు క్రమం తప్పకుండా దంత పరీక్షలు చేయించుకుంటూ కూడా ఉండాలి.

వీళ్లకు వేరే సినిమాల వల్లే హిట్ సినిమాల్లో ఛాన్సెస్ వచ్చాయి..?
Advertisement

తాజా వార్తలు